కలకత్తా హైకోర్టు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యొక్క దుర్గా పూజ ప్రణాళికను తాత్కాలికంగా నిలిపివేసింది.మమతా బెనర్జీ రాష్ట్రంలో ప్రతి పూజకు రూ.10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన ప్రయోజనాల కోసం ప్రజా ధనాన్ని ఎలా ఉపయోగిస్తారని కోర్టుకు పిటిషనర్ కోరారు.  దుర్గా పూజ కోసం 28 కోట్ల రూపాయలు ఇవ్వాలన్న నిర్ణయంపై కోర్టు స్టే విధించింది.  కాగా,  కోల్‌కతాలోని మొత్తం 3 వేల పూజా కమిటీలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 వేల కమిటీలకు రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్టు సీఎం మమత గత నెలలో ప్రకటించారు.


ఇదిలా ఉంటే..ఇది మన రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్ణయాలకు విరుద్ధంగా అమలు అవుతోందని వామపక్ష పార్టీ ఆర్ఎస్పికు అనుబంధంగా ఉన్న యునైటెడ్ ట్రెండ్స్ యూనియన్ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. దీనిని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవాశిష్ కర్ గుప్తా, జస్టిస్ షంపా సర్కార్‌తో కూడిన ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది.  దుర్గా పూజ ఉత్సవాలకు ఏ ప్రాతిపదికన డబ్బులు పంపిణీ చేయబోతున్నారని ప్రశ్నించింది. ఈ విషయంలో ఏవైనా గైడ్ లైన్స్ పాటిస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.


డబ్బులు కేవలం దుర్గా పూజకే పంపిణీ చేస్తున్నారా? లేక ఇతర పండుగలకు కూడా ఇస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  ఓ వైపు రాష్ట్రం అప్పుల్లో ఉంటే..ఇలాంటి ఖర్చులు దేనికి అని ప్రశ్నించింది.  డబ్బులు తీసుకున్న కమిటీలు దానిని దుర్వినియోగం చేస్తే ఎటువంటి చర్యలు చేపడతారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.  ముఖ్యమంత్రి 'సేఫ్ డ్రైవ్ సేవ్ లైఫ్' ప్రచారాన్ని హైలైట్ చేయడానికి డబ్బును రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించే నిర్ణయాన్ని తీసుకుందని సమర్థించుకునే ప్రయత్నం చేసింది.  కోర్టు తీర్పుపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. హైకోర్టు నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్వాగతించారు. ఇలాంటి నిర్ణయాలతో మమతా బెనర్జీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: