జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర మరి కొద్ది రోజులలో పశ్చిమగోదావరి జిల్లాలో ముగియనున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. ఇదే క్రమంలో త్వరలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర చేయనున్న క్రమంలో ఆ జిల్లాకు చెందిన నేతలతో కూడా సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్.

Image may contain: 1 person, sitting

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన పార్టీ కి తూర్పు గోదావరి జిల్లా ఆయువు పట్టు అని పేర్కొన్నారు. 19 నియోజకవర్గాలు కలిగిన ఈ జిల్లాలో 20 నుంచి 22 రోజుల పాటు పర్యటించనున్నారు తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకులకు తెలిపారు. ముఖ్యంగా 15వ తేదీ క‌వాతుతో తూర్పులో అడుగుపెట్టాక‌, జిల్లాపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తాన‌న్నారు.

Image may contain: 1 person, indoor

తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పు, రాష్ట్రం మొత్తాన్ని ప్ర‌భావితం చేస్తుందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.. పార్టీలో ఉన్న నాయ‌కులు ఏం చేయ‌క‌పోయినా ప‌ర్వాలేదు గానీ., ఉన్న‌దాన్ని చెడ‌గొట్ట‌కుండా ఉంటే అద్భుతాలు సాధించ‌వ‌చ్చంటూ కొంత మందికి చుర‌క‌లు కూడా అంటించారు.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డే వారిని, ప‌ని చేసేవారిని గుర్తించి ముందుకి తీసుకువెళ్లాల‌ని సూచించారు.

Image may contain: 3 people, people standing and beard

తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ బలంగా ఉన్న అక్కడ పార్టీకి చెందిన నాయకులు పట్టు సాధించలేకపోతే మాత్రం..అది ముమ్మాటికి నాయకుల తప్పేనని పేర్కొన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు.. పార్టీల నాయకుల మధ్య తగాదాలు పెట్టుకుంటే నాకు నచ్చదు అని ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులకు తెలిపారు పవన్. ఒక దృఢమైన సంకల్పం తో రాజకీయాల్లో అడుగు పెట్టాను కనుక ప్రతి ఒక్కరు సహకరించాలని తన పార్టీ నేతలకు తెలియజేశారు పవన్ కళ్యాణ్.



మరింత సమాచారం తెలుసుకోండి: