మైసూరు నగరానికి ఎంతో చారిత్రాత్మక, ఆధ్యాత్మిక బంధం అనుబందం ఉంది. దైవికమైన కార్క్రమలాకు ఈ పట్టణం నిలయంగా ఉంటూ వచ్చింది. ఈ నగరానికీ, దసరా సంబరలకు యుగాలనాటి చరిత్ర ఉంది. ఓ విధంగా చెప్పాలంతే మైసూర్ అంటే దసరా, దసరా అంటే మైసూర్. అంతటి విశిష్టమైన, పవిత్రమైన నగరంగా పేరు గడించింది.


అలా మొదలు :


చరిత్రకారులు ప్రకారం, మైసూర్ దసరా 14 వ శతాబ్దంలో విజయనగర పాలకులు పాలించిన సమయంలో నడ హబ్బా (ఒక రాష్ట్ర ఉత్సవం) గా మారింది. తరువాత, వారి పతనం తరువాత, మైసూర్ యొక్క వడయార్లు అసమానమైన వైభవంగా ఒక దృశ్యం గా మార్చారు. 1610 లో, శ్రీరంగపట్నంలో, రాజా వొడయార్ I, నవరాత్రులను జరుపుకునే విజయనగర సంప్రదాయాన్ని తిరిగి ప్రవేశపెట్టారు, తొమ్మిది రోజులు భక్తి మరియు పండుగల సమ్మేళనం అని భరోసా ఇచ్చారు. ఇది 1805 లో కృష్ణరాజ వడయార్ III యొక్క పాలనలో ఉంది, 


ఆధ్యాత్మిక  వైభవమ్ :


ఆయన హయాంలో నవ రాత్రులను ఘంగాన నిర్వహించి పది రోజుల పాటు దసరా వైభవోపేతంగా నిర్వహించడం ఆరంభమైందని అంటారు. రాజుల ఆద్వర్యంగా జరిగిన ఈ ఉత్సవాలు అమ్మవారు దిగివచ్చేలా, ఆ తల్లి చల్లని చూపు మొత్తం నగరంపై ప్రసరించేలా అట్టహాసంగా జరుగుతాయి. పది రోజులూ పూర్తిగా ఆధ్యాత్మిక పరిమళాలలతో నగరం మొత్తం  ఉంటుంది. నగరం మొత్తం ఒక్కటిగా చేసుకునే వేడుకగా దీన్ని నాటి నుంచి అమలు చేస్తూ వచ్చరు. పేద, గొప్ప తారతమ్యం లేకుండా అంతా కలసి ఒక్కటిగా జరుపుకుంటారు. ఆనందంతో చిందులు వేస్తారు.  అలా మైసూర్ ప్యాలెస్ లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.



మహిషుడిని వధించి :


మహిషాసురుడనే రాక్షసుడు ఒకడు ఉండేవాడని పురాణేతిహాసాల్లో కధలు ఉన్నాయి. అతని వల్ల అష్టకష్టాలు పడిన జనం తమను రక్షించమని దేవ దేవులందరినీ మొక్కుకుంటారు. కానీ ఎవరి వల్ల అతనికి మరణం లేకుండా పోతుంది. అపుడు అమ్మ వారు మహిషాసుర మర్ధనిగా అవతారం ఎత్తి ఆ దుష్టున్న్ని దునుమాడుతారు. పది రోజుల పాటు సాగిన ఆ పోరులో మహిషుడు నేలకొరుగుతాడు.
అలా చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తు గా విజయదశమి వేడుకలను జరుపుకుంటారు. ఇక మహిషున్ని వధించినందుకు ఆ ప్రేదేశానికి తదనంతర కాలంలో మహిషూర్, మైసూర్ గా పేరు వచ్చిందని సుప్రసిధ్ధ చరిత్ర కధనం. పురణేతిహాసం.


మరింత సమాచారం తెలుసుకోండి: