కల్లు చెట్టు దగ్గర ఎందుకున్నావంటే పాలు తాగడానికి అని వెనకటికి ఒకడు చెప్పాడట.చేసే పని ఒకటి, చెప్పేదొకటి. మన రాజకీయ నాయకులకు తీరే ఇలా ఉంటుంది జరిగే ప్రతి పరిణామాన్ని   అనుకూలంగా మార్చేసుకుని తన డైరెక్షన్లోకి అటు పార్టీని, ఇటు జనాలను తేగలడంలో బాబు సిధ్ధహస్తుడు. అందుక మరో మారు ఆయన మైండ్ గేం మొదలెట్టారు. 


ఐటీ దాడులే సాకు :


 
ఐటీ దాడులు గడచిన రెండు మూడు రోజుల్లో ఏపీలో ఎంతటి హడావుడి స్రుష్టించాయో తెలిసిందే. ఆ దాడులపై టీడీపీ, దాని అనుకూల మీడియా మరెంతటి ఓవరాక్షన్ చేసిందో కూడా ఎరుకే. ఇపుడు ఆ దాడులనే బూచిగా చూపిస్తూ బాబు తనదైన రాజకీయం మొదలెట్టేశారు. మెల్లగా అటు వైపు నుంచే నరుక్కొస్తున్నారు. టీడీపీ ఎంపీలు, ముఖ్య నాయకుల మీటింగులో బాబు వారికి  మరింత భయం పుట్టించే విధంగా మాట్లాడి నాయకులను తన రూట్లోకి వచ్చేలా చేసుకున్నారు.


కొత్త పొత్తులట :


ప్రతి ఎన్నికకూ ఓ కొత్త పొత్తు, సరి కొత్త నినాదం, జనాలను ఏమార్చే విధంగా అనుకూల మీడియాలో విస్త్రుత ప్రచారం, ఇదే కదా టీడీపీ బాబు హయాంలో చేస్తున్నా రాజకీయం. పార్టీ మీటింగులో బాబు చెప్పిందీ అదే. బీజేపీ దాడులతో బెంబేలెత్తిన నాయకులను దగ్గర కూర్చోబెట్టుకుని బాబు చెప్పిన సుద్దులు ఏంటంటే ఈ పార్టీ అధికారంలో ఉంటే ఇలాగే చేస్తుంది. అందువల్లనే మనం కొత్త పార్టీ వైపు, కొత్త పొత్త్లూ వైపు పోదాం అంటూ ఇండైరెక్ట్ గా కాంగెస్ తో పొత్తును ఒప్పించే విషయంలో సక్సెస్ అయిపోయారు. 


వక్ర భాష్యం రెడీ :


తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అన్నదానిపై తెలుగు ప్రజలందరికీ అవగాహన వుంది. కాంగ్రెస్ రాజకీయాలకు వ్యతిరేకంగా, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం అన్న నందమూరి నాయకత్వంలో  ఏర్పాటు అయిన పార్టీగా అందరూ చెపుతారు. మరి అదే టీడీపీలో ఉన్న నాయకులకు ఆ చారిత్రక వాస్తవం తెలియదు అనుకోవాలా. కానీ బాబు దాన్ని సైతం వక్ర భాష్యం చెప్పడం మొదలెట్టేశారు. తెలుగు వారి కోసం తెలుగుదేశం పెట్టరట. కాంగ్రెస్ వ్యతిరేకంగా కాదట. 
ఈ మాట చెప్పి రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ తో చెట్టపట్టాలు వేసుకునేందుకు అపుడే రూట్ మ్యాప్ రెడీ చేశారన్న మాట. బాబు తరచూ అనే మాట సంక్షోభాల నుంచి సమాధానాలు వెతుక్కుంటాను అని, అది నిజమే ఇపుడు ఐటీ దాడుల నుంచి ఏపీలో కూడా కాంగ్రెస్ పొత్తుకు బాబు సమాధానం బాగానే వెతుక్కున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: