కాంగ్రెస్ పార్టీ జాతీయ అధక్షుడు రాహూల్ గాంధికి పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్నపుడు, అందులోనూ జనాల మధ్య ఉన్న సమయంలో ప్రమాదం జరగటంతో జనాలు భయంతో పరుగులు తీశారు. ఇంతకీ విషయం ఏమిటంటే, మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్  రాహూల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఆ సమయంలో కొందరు కార్యకర్తలు బెలూన్లతో స్వాగతం పలికారు. 

 

అయితే అదే సమయంలో కొందరు మహిళా కార్యకర్తలు కూడా హారతులు తీసుకుని రాహూల్ ప్రయాణిస్తున్న వాహనం వద్దకు వచ్చారు. హారతులను చూసి రాహూల్ కూడా వాహనంలోనుండి ముందు వంగారు. ఎప్పుడైతే బెలూన్ల దగ్గరకు హారతులను తీసుకొచ్చారో ఒక్కసారిగా బెలూన్లు పేలిపోయాయి. కారణమేమిటంటే బెలూన్లలో నైట్రోజన్ వాయువుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. నైట్రోజన్ వాయువుకు అగ్గి తోడైతే మంటలు చెలరేగుతాయి. ఇక్కడా అదే జరిగింది.

 

అసలే బెలూన్లు చాలా పలుచగా ఉంటాయి. దానికితోడు హారతి ప్లేట్లలో నుండి మంటలు తగిలాయి. దాంతో  నైట్రోజన్ వాయువు ఒక్కసారిగా యాక్టివేట్ అవటంతో బెలూన్లన్నీ పగిలిపోయాయి. అన్నీ బెలూన్లు ఒక్కసారిగా పగిలిపోయి నైట్రోజన్ వాయువులు బయటకు చిమ్మటంతో పెద్ద ఎత్తున మంటలు కమ్ముకున్నాయి. ఊహించని విధంగా మంటలు చెలరేగటంతో చుట్టూవున్న నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ప్రణభయంతో పరుగులు తీశారు. అదే సమయోం మంటలను గమనించిన రాహూల్ కూడా వాహనంలోనే వెనక్కు జరిగారు లేండి. దానికితోడు మంటలు ఎలా వచ్చాయో అలాగే చల్లారిపోయాయి. దాంతో రాహలూల్ పెద్ద ప్రమాదం నుండి బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: