భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పదవిలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు చేశారు.  ఎన్నో ప్రయోగాత్మక పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు.  అంతే కాదు నలధనం నిర్మూలన కోసం పెద్ద నోట్ల రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లు తీసుకు వచ్చాడు.  మరో ముఖ్యమైన కార్యక్రమం స్వచ్ఛభారత్.   మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటే..సమాజం బాగుంటుంది..సమాజం బాగుంటే దేశం బాగుంటుందని నినాదంతో సినీ, రాజకీయ, క్రీడారంగానికి చెందిన వారు కూడా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటూ తమవంతు కృషి చేస్తున్నారు. 
Photo Of Rajasthan Politician Urinating In Public Is Viral. He Defends It
బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకుండా దేశాన్ని స్వచ్ఛంగా ఉంచాలంటూ ఓ వైవు ప్రధాని మోదీ పిలుపునిస్తున్నా ఆ పార్టీకి చెందిన నేతలే స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా రాజస్థాన్ బీజేపీ నేత, మంత్రి శంభూ సింగ్ ఖేటసర్ బహిరంగంగా మూత్ర విసర్జన చేసి వార్తల్లోకి ఎక్కారు.  అసలే ఎన్నికల హడావుడి నడుస్తున్న సమయంలో  ఈ ఫోటోని వైరల్ అవుతుది..అంతే కాదు సదరు మంత్రి చేసిన పనికి నెటిజెన్లు ఆయనపై విరుచుకుపడ్డారు.   

ఎన్నికల ప్రచారంలో భాగంగా అజ్ మేర్ లో పర్యటిస్తున్న సందర్భంగా... ఓ గోడ వద్ద ఆయన మూత్ర విసర్జన చేశారు. ఆ గోడపైన బీజేపీ పోస్టర్ కూడా ఉండటం గమనార్హం.  ఇదిలా ఉంటే..తనపై నెటిజెన్లు ట్రోల్ చేస్తుండటంతో... ఎట్టకేలకు ఆయన స్పందించారు. బీజేపీ పోస్టర్ వద్ద తాను మూత్ర విసర్జన చేయలేదని... ఆ ఫొటోలో ఉన్నది తాను కాదని చెప్పారు. 

అంతే కాదు మరో అడుగు ముందుకు వేసి..బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం తప్పు కాదని, అయితే అది నిర్మానుష్య ప్రాంతమై ఉండాలని అన్నారు. తాను మూత్ర విసర్జన చేసింది నిర్మానుష్య ప్రాంతంలో అని చెప్పారు. అలాంటి ప్రాంతంలో ఎవరైనా మూత్ర విసర్జన చేస్తే వ్యాధులు వ్యాపించవని అన్నారు. కాగా, మంత్రి తాను చేసిన తప్పును ఇలా సమర్థించుకోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: