పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి నాలుగేళ్లు అయినా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు ఏంటో ఎవరికీ తెలియడం లేదు.  ఎన్నికల టైమ్ దగ్గరపడింది, తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇంకా జనసేన పార్టీకి గుర్తురాలేదు. పిడికిలి గుర్తు కోసం ఎన్నికల కమిషన్ కి దరఖాస్తు చేసినా అది ఫైనల్ కాలేదు. ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకోండి అంటూ కార్యకర్తలకు ఉపదేశం చేస్తున్న పవన్ కల్యాణ్, అదే సమయంలో పార్టీ గుర్తు నమోదుపై ఇన్నాళ్లూ ఎందుకు బద్దకించారో తెలియడంలేదు.


పవన్ కు అక్కడే డిపాజిట్స్ రాకపోతే ఇంకెక్కడ వస్తాయి...!

జనసేన అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది నక్షత్రం గుర్తే. పిడికిలి ఇంకా అనుకున్న స్థాయిలో జనాల్లోకి వెళ్లలేదు. ఒకవేళ చివరి నిముషంలో కాలం కలసిరాక పిడికిలి కూడా దక్కకపోతే పవన్ పరిస్థితి ఏంటి? కొత్త సింబల్ ని జనాల్లోకి తీసుకెళ్లడం జనసేనకు తలకుమించిన భారంలా మారుతుంది.


పవన్ కు అక్కడే డిపాజిట్స్ రాకపోతే ఇంకెక్కడ వస్తాయి...!

వైఎస్ జగన్ కూడా ఓ దశలో పార్టీ గుర్తుని చంకలో పెట్టుకుని రాష్ట్రమంతా పర్యటించారు. సీలింగ్ ఫ్యాన్ ని చేతిలో పట్టుకుని వెళ్లిన ప్రతిచోటా మీటింగ్ లో తిప్పిమరీ చూపించేవారు. తాను ప్రసంగిస్తున్నంతసేపు పక్కన అభ్యర్థికి ఆ ఫ్యాన్ ఇచ్చి పట్టుకోమనేవారు. గుర్తుకున్న పవర్, గుర్తుకు రావాల్సిన పబ్లిసిటీ అలాంటిది మరి. అయితే అలాంటి కీలక గుర్తు విషయంలో పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం అర్థం కావడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: