కేసీఆర్ రాజకీయాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం లో మంచి దిట్ట. ప్రత్యర్థిని అంచనా వేయడం లో కేసీఆర్ ను కొట్టే వాడే లేడు. అయితే డిసెంబర్‌ 7న తెలంగాణలో ముందస్తు ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఫలితం 11న విడుదల కాబోతోంది. ఎన్నికల కోడ్‌ ఎప్పుడో అమల్లోకి వచ్చేసింది. తెలంగాణ అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌ ఎందుకు వెళ్ళారు.? తొమ్మిది నెలల పరిపాలనా కాలాన్ని తనంతట తానుగా కేసీఆర్‌ వదులుకున్నారంటే, ఆయన ఇంత రిస్క్‌ ఎలా చేయగలగిరారు.? ఈ రిస్క్‌ వెనుక ఆయనకున్న క్యాలికుయలేషన్స్‌ ఏమున్నాయ్‌.? 

Image result for kcr

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతమవుతోందన్న ఖచ్చితమైన సమాచారంతోనే ఆయన ఈ రిస్క్‌ తీసుకోక తప్పలేదన్న సమాధానం వస్తుంది. నిజమే, 2019 ఎన్నికల నాటికి దేశంలో కాంగ్రెస్‌ పార్టీ బలపడబోతోంది. అధికారం చేజిక్కించుకునే స్థాయిలో కాకపోయినా, ఎంతోకొంత బలం అయితే కాంగ్రెస్‌ పార్టీకి 2014 ఎన్నికలతో పోల్చితే, 2019 ఎన్నికల్లో కన్పించబోతోంది. ఆ ఇంపాక్ట్‌ ఖచ్చితంగా తెలంగాణలో కన్పిస్తుందని ముందే ఊహించిన కేసీఆర్‌, ఆ ఛాన్స్‌ కాంగ్రెస్‌కి ఇవ్వకూడదనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు.

Image result for kcr

అసెంబ్లీ రద్దుచేసే ముందు ఢిల్లీకి వెళ్ళి, బీజేపీ పెద్దల ఆశీర్వాదం తీసుకున్న కేసీఆర్‌, అంతకు ముందే మజ్లిస్‌ పార్టీ నుంచి మరోమారు స్నేహహస్తంపై భరోసా పొందారు. తెలంగాణలో ఈ రెండు పార్టీలూ ఇప్పుడు కేసీఆర్‌కి, తెరవెనుకాల మద్దతిచ్చే పార్టీలు. ఇందులో మజ్లిస్‌ బాహాటంగానే టీఆర్‌ఎస్‌కి మద్దతిస్తోంటే, బీజేపీది తెరచాటు స్నేహం ప్రదర్శిస్తోంది. 100 సీట్లు కొల్లగొట్టేస్తాం.. అని గతంలో ప్రకటించిన కేసీఆర్‌.. ఇప్పుడు, 110 సీట్లు గెలిచేస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం టీఆర్‌ఎస్‌పై గట్టిగానే కన్పిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల్ని ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు నిలదీస్తుండడమే ఇందుకు కారణం. 


మరింత సమాచారం తెలుసుకోండి: