ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ అభ్యర్ధి గెలవాలనే అనుకుంటాడు. అలా గెలిచేందుకు దగ్గర దారులూ వెతుకుతాడు.  అందుకే ఇపుడు ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లకే గిరాకీ బాగా ఉంటోంది. ఎంపీ సీటు అంటే రూట్ మార్చేస్తున్నారు. వద్దు బాబోయ్ అని పరుగులు తీస్తున్నారు. రేపటి ఎన్నికల్లో ఇక్కడ మొత్తం ఎంపీ సీట్లు గెలుచుకుని చక్రం తిప్పాలనుకుంటున్న అధి నాయకులకు ఈ వ్యవహారం ఏమీ పాలుపోవడం లేదట.


ఆ పార్టీ బెటర్ :


ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధికార టీడీపీకి ఎంపీ క్యాండిడేట్ల కొరత పెద్దగా లేదంటున్నారు. చేతిలో పవర్ ఉండడంతో పాటు ఆర్ధిక వనరులు కూడా పుష్కలంగా ఉండడంతో అధినేత భరోసా ఇస్తే రంగంలోకి దిగిపోతానమని నాయకులు అంటున్నారు. ఉత్తరాంధ్రాలో అయిదు ఎంపీ సీట్లలో రెండు సిట్టింగులకే ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయింది. శ్రీకాకుళం  నుంచి మళ్ళీ కింజరపు రామ్మోహననాయుడు పోటీ చేస్తారు. విజయనగరం నుంచి వరిష్ట నేత అశోక్ బరిలో ఉంటారు.


విశాఖలో ఉన్న మూడు ఎంపీ సీట్ల్ల విషయానికి వస్తే అనకాపల్లి నుంచి సిట్టింగ్ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీకి అంటున్నారు. ఆయన ప్లేస్ లో బలమైన నేతను టీడీపీ వెతుకుతోంది. ఇక్కడ మాజీ మంత్రి కొణతాలతో పాటు, మంత్రి అయ్యన్నపాత్రుడు పేరు కూడా వినిపిస్తోంది. అలాగే మాజీ ఎంపీ సబ్బం హరి కూడా ఉన్నారంటున్నారు. విశాఖ ఎంపీ సీటుకు ఇటీవల మరణించిన ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్ పేరు గట్టిగా ప్రచారంలో ఉంది. అరకు ఎంపీ సీటు మాత్రం ఓ పట్టాన తెగడంలేదు. ఇక్కడ కూడా టీడీపీ బలమైన నేతనే దించాలనుకుంటోంది. మొత్తానికి ఎంపీ క్యాండిడేట్ల విషయంలో టీడీపీ సేఫ్ జోన్లో ఉంది.


వైసీపీకి ఇబ్బందే :


ఒక్క విశాఖపట్నం తప్ప వైసీపీకి ఇంతవరకూ ఎంపీ క్యాండిడేట్లు దొరకలేదు. విశాఖ  ఎంపీ సీటు కూదా ఎంవీవీ సత్యనారాయణ అనే బిల్డర్ కి ఇస్తున్నారు. అయనకు జనంలో పెద్దగా పరిచయాలు లేవు. రాజకీయ నేపధ్యమూ లేదు. అనకాపల్లి, అరకు ఎవరూ డిసైడ్ కాలేదు. విజయనగరం నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు వినిపిస్తున్నా ఆయన అసెంబ్లీకే అంటున్నారు.


శ్రీకాకుళం ఎంపీ సీటు కూడా పెద్ద తలకాయ నొప్పిలా ఉంది. ఇక్కడ గతంలో పోటీ చేసి ఓడిపోయిన రెడ్డి శాంతి ఈ దఫా ఎమ్మెల్యె  బరిలో ఉన్నారు. దాంతో కొత్త క్యాండిడేట్ ని తీసుకురావాలి. మొత్తం మీద చూసుకుంటే రేపటి ఎన్నికల తరువాత డిల్లీలో చక్రం తిప్పేది మేమే అంటున్న వైసీపీకి ఎంపీ క్యాండిడేట్లు కనిపించడం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: