ఏదైతే జనం ద్రుష్టిలో నుంచి మళ్ళించాలని  తెలుగుదేశం పార్టీ అనుకుంటోందో దానిపైనే వారు గురి పెట్టారు. అసలు విషయాన్ని మరుగున పెట్టే అధికార పార్టీ వైనాన్ని రట్టు చేశారు. అక్కడ జనాలను మభ్యపెట్టేందుకు యత్నిస్తే తీవ్ర పరిణామలేనని కూడా హెచ్చరించారు. దీంతో ఇపుడు తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు.


బాక్సైట్ బాకులు :


విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ బాకులను దించాలని అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వం ప్రయత్నించింది. దానికి మావోలు ఎదురు తిరగడమే కాకుండా జనాలను సంఘటితం చేస్తూ వచ్చారు. అలా రెండున్నర దశాబ్దాల ఈ విక్రుత క్రీడల ఎందరో రాజకీయ నాయకులను మావోయిస్టులు చంపేశారు. అయినా మరో రూపంలో పాలకులు ప్రయత్నించడంతో  ఆ నరమేధం అలా సాగుతూనే ఉంది. ఇది ప్రభుత్వాలకు అభివ్రుధ్ధి పేరిట వ్యాపారమేనని మావోలు బహిరంగానే ఆరోపిస్తున్నారు. 


ఆ హత్యలకు రాజకీయం :


సరిగ్గా పద్దెనిమిది రోజుల క్రిత్రం అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, శివేరి సోమల దారుణ హత్యలు జరిగాయి. ఈ హత్యలను మావోయిస్టులు చేశారు. బాక్సైట్ గనుల తవ్వకాలకు అనుకూలంగా ఉన్నారన్న కారణంగానే హత్య చేసినట్లుగా మావోలు చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు కధనాలు వినిపించారు. దీంతో ఉలిక్కిపడిన అధికార టీడీపీ నాయకులు దానికి రాజకీయ రంగు పులిమారు. బాక్సైట్ గనుల తవ్వకాలే  కారణమంటే గిరిజనంలో టీడీపీ పట్ల వ్యతిరేకత పెరిగిపోతుందని భయపడే తమ్ముళ్ళు  ఇలా చేశారు.


వైసీపీ మీద బాణాలు :


హత్య జరిగి ఇరవై నాలుగు గంటలు కాకుండానే ఇది వైసీపీ నాయకులు సూత్రధారులుగా జరిగిన హత్య అంటూ ఏకంగా అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ భారీ ప్రకటన విడుదల చేశారు. మావోలతో చేతులు కలిపి ఇలా చేయించారని కూడా చెప్పుకొచ్చారు. దీనిపైన పోలీసులు రాజకీయ కోణంలో కూడా విచారణ చేయాలని కూడా అదేశాలు వెళ్ళాయి. 


ఇరకాటం తప్పలేదు :


అయితే ఇందులో కొంత రాజకీయ కోణం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే సూత్రధారులు వైసీపీ నేతలు కాదు, అధికార టీడీపీ నాయకులే మావోలతో చేతులు కలిపి కిడారి, సోమల అడ్డు తొలగించుకున్నారని బయటకు రావడంతో టీడీపీ నేతలు మరింత ఇరకాటంలో పడ్డారు. ఆ దర్య్పాప్తు వివరాలు ఇంకా పోలీసులు అధికారికంగా వెల్లడించడానికి తర్జన భర్జన పడుతున్న టైంలో అదను చూసి మావోల పేరిట వచ్చిన ఈ లెఖ టీడీపీ మొత్తం పరువు తీసేసింది. 


బాక్సైట్ పైనే గురి :


కిడారి సోమల హత్యలకు బాక్సైట్ తవ్వకాలే కారణమని ఆ లేఖలో క్లారిటీ ఇవ్వడంతో టీడీపీకి అనుకున్నదంతా అయింది. విశాఖ ఏజెన్సీలో అధికార పార్టీకి ఇప్పటికే ఎదురు గాలి బలంగా వేస్తోంది. మావోల లేఖతో అది మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏజెన్సీలో అనధికారికంగా క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయని జనసేనాని పవన్ కళ్యాన్ కూడా తన అరకు, పాడేరు  పర్యటనలో చెప్పిన సంగతి విధితమే. దీని వెనక పెద్ద తలకాయలే ఉన్నారని అంటున్నారు.
ఇపుడు మావోలు ఆ సంగతినే ప్రధానంగా చెప్పడంతో పాటు, పార్టీ ఫిరాయింపులను కూడా నేరంగా పేర్కోనడంతో టీడీపీకి మొత్తం గాలి తీసేసినట్లంది. రేపటి రోజున ఇక్కడ అధికార పార్టీకి చిక్కులు తప్పవని లేఖ ద్వారా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: