కేంద్రమాజీ మంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి కార్యాలయాలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరపటం తెలుగుదేశంపార్టీలో సంచలనమైంది. హైదరాబాద్ లోని సుజనా కార్యాలయాలపై చెన్నై నుండి వచ్చిన ఈడి బృందం దాడులు చేసింది. చెన్నై టీం దాడులు జరిపిన విషయం హైదరాబాద్ లోని ఈడి అధికారులకు కూడా ముందుగా సమాచారం లేకపోవటం గమనార్హం. మాజీ మంత్రి విజయరామారావు కొడుకు కల్యాణ శ్రీనావాస్ పై అంతకుముందే సిబిఐ దాడులు జరపటం తర్వాత సుజనాపై ఈడి దాడులు జరపటంతో టిడిపి నేతల్లో వణుకు మొదలైంది. ఏ దర్యాప్తు సంస్ధ అధికారులు ఎవరిపై దాడులు జరుపుతారో తెలీక మంత్రులు, నేతల్లో అయోమయం మొదలైంది.

 

సుజనా పై ఎప్పటి నుండో ఆర్దిక ఆరోపణలున్న విషయం అందరికీ తెలిసిందే. బ్యాంకుల నుండి వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవటం ఏదో ఒక పద్దతిలో ఎగొడుతున్నారనే ఆరోపణలపై కేసు కూడా నమోదైంది. మారిషస్ బ్యాంకు నుండి రూ 100 కోట్లు లోన్ తీసుకుని ఎగొట్టిన విషయంలో సుజనా నాంపల్లి కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆ కేసులోనే కోర్టు సుజనాపై గతంలో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. సరే ఏదో అవస్తలుపడి ఆ వారెంటును రద్దు చేయించుకున్నారనుకోండి అది వేరే సంగతి.


ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఐటి,ఈడి దాడులు జరుగుతాయనే భయం చంద్రబాబునాయుడు అండ్ కో లో మొదలైంది. పర్టిక్యులర్ గా ఐటి, ఈడి దాడుల గురించే భయపడుతున్నారంటే ఆలోచించాల్సిందే . దానికి తగ్గట్లుగానే మొన్న విజయవాడలో పలువురు వ్యాపారులు, నిర్మాణరంగంలోని యాజమాన్యాలపై ఐటి దాడులు జరిగాయి.  ఆ దాడులనే చంద్రబాబు నుండి క్రిందిస్ధాయి నేతల వరకూ రాష్ట్రంపై దాడులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేయటం విచిత్రంగా ఉంది. అందుకే మొన్న ఐటి దాడులు చేసిందంతా చంద్రబాబు అండ్ కో బినామీలపైనే అంటూ వైసిపి నేతలు ఎదురుదాడి చేశారు.

 

అయితే, ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్ధలతో దాడులు చేయిస్తే చంద్రబాబు దాన్ని కూడా రాబోయే ఎన్నికల్లో సానుభూతికి వాడుకుంటారనే అనుమానాలతోనే బిజెపి నాయకత్వం ఆలోచిస్తోందనేది సమాచారం. కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వారి చెప్పు చేతుల్లో ఉంటున్నాయన్న విషయం కొత్తేమీ కాదు. తమకు గిట్టని వారిపైన, రాజకీయంగా కక్ష సాధింపు కోసం కూడా కేంద్ర దర్యాప్తు సంస్ధలను అధికారంలో ఉన్న పార్టీలు ఉపయోగించుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి.

 

ఇపుడు సుజనా పై దాడులు కూడా అందులో భాగంగానే చూడవచ్చు. కాకపోతే ఆర్దిక అవినీతిలో కూరుకుపోయిన వారిపైనే దాడులు చేయగలరు కానీ క్లీన్ చిట్ ఉన్న వారిపైనో లేకపోతే ఆర్దిక అవకతవకలకు పాల్పడని వారిపై ఏ సంస్ధలు దాడులు చేయలేవు. ఒకవేళ చేసినా ఏమీ దొరకదన్న విషయం అందరికీ తెలిసిందే. సుజనాపై ఆర్ధిక అవినీతి ఆరోపణలు ఎప్పటి నుండో వినిపిస్తున్నవే. అందుకే ఇపుడు దాడులు జరిగాయి. ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు టిడిపిలో చాలా మందే ఉన్నారు. అందుకే తమపై ఐటి, ఈడి దాడు జరుగుతాయని భయపుతున్నారు. మొత్తానికి సుజనా కార్యాలయాలపై దాడుల్లో విలువైన డాక్యుమెంట్లు సీజ్ చేసి తీసుకుపోయారని సమాచారం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: