వైఎస్ జగన్ రాజకీయం చిత్రంగా ఉంటుంది. ఆయన అప్పటి అవసరాలు బట్టి ఏదీ డిసైడ్ చేయరు. ఒక మనిషి నచ్చితే ఒకే. నచ్చకపోతే మాత్రం ఆ అభిప్రాయాన్ని  ఎప్పటికీ మార్చుకోరని అంటారు. అతని వల్ల ఎంత ఉపయోగం పార్టీకి ఉన్నా కూడా నచ్చకపోతే నో చెబుతారని టాక్ ఉంది.  గతంలో  ఆయనకు తగిలిన దెబ్బలు అలాంటివి అందుకు  కారణమని చెబుతారు. 2014లో త్రుటిలో తప్పిపోయిన అధికారం ఈసారి ఒడిసి పట్టాలని జగన్ హార్డ్ వర్క్ చెస్తున్నారు. దాంతో ఆయన నిర్ణయాలు కూడా గట్టిగానే ఉంటున్నాయి.


అదే రూల్ :


వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో జగన్ టికెట్లు ఎవరికి ఇవ్వాలి. ఏంటన్న దానిపై పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఆయన అయిదేళ్ళ ప్రతిపక్ష రాజకీయంలో బాగానే రాటుతేలారు. పోయిన ఎన్నికల్లో చేసిన తప్పులు రిపీట్ కాకూడదని గట్టిన భావిస్తున్నారట. అందుకే పార్టీలో తనదైన రూల్ ఒకటి తెచ్చారట.


నమ్మకం లేదా  :


వైసీపీలో సీనియర్ తలకాయలు చాలానే ఉన్నాయి. వారంతా కాంగ్రెస్ రాజకీయాల్లో ముదిరిపోయారు. వారిని జగన్ పార్టీలో పెట్టుకుని ఒక టైంలో బాగానే ఆదరించారు. కానీ ఇపుడు మాత్రం సీనియర్ల పట్ల కొంత నమ్మకం సడలినట్లుగా చెతున్నారు. వారి ప్లేస్ లో జూనియర్లు, యంగ్ స్టర్స్ ని తీసుకుంటే తనకు, పార్టీకి విశ్వాసంగా ఉంటారని జగన్ అనుకుంటున్నారట.


గత అనుభవాలు :


సీనియర్లను నమ్మి కేవలం ప్రచారం వరకూ గత ఎన్నికల్లో జగన్ చూసుకున్నారు. అప్పట్లో పెద్ద నాయకులకు ఫ్యామిలీ ప్యాకేజ్ ని కూడా జగన్ అమలు చేశారు.  కర్నూల్ లో భూమా నాగిరెడ్డి  కుటుంబానికి మూడు టికెట్లు, నెల్లూరులో మేకపాటి ఫ్యామిలీకి మూడు, చిత్తూర్లో పెద్దిరెడ్డి కుటుంబానికి రెండు, శ్రీకాకుళంలో ధర్మాన కుటుంబానికి రెండు ఇలా టికెట్లు పంచుకుంటూ పోయారు. వీరిలో భూమా కుటుంబం జగన్ కి తీరని అన్యాయమే చేసింది. దాంతో సీనియర్లు అంటే జగన్ కి నమ్మకం అంతగా కుదరటంలేదట.


రెండే సీట్లు :


ఈసారి సీనియర్లకు ఒక్కటి మాత్రేమే టికెట్ అంటూ జగన్ అంటున్నారట. మరీ పట్టుపడితే, వారి అవసరం పార్టీకి ఉందనుకుంటే రెండు ఇస్తారట. అంతకు మించి సీట్లు ఇచ్చేందుకు జగన్ ససేమిరా అంటున్నారట. విజయనగరంలో జగన్ ఇపుడు పాదయాత్ర చేస్తున్నారు. ఇక్కడ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నాలుగు టికెట్లు ఫ్యామిలీ ప్యాకేజ్లో భాగంగా అడుగుతున్నారట. జగన్ రెండు దగ్గరే ఆగుతున్నారట. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: