ఉప ఎన్నికలు రావడం లేదని ఓ రాజకీయ పార్టీ తెగ తల్లడిల్లిపోతోంది. అసలు వచ్చి ఉండాల్సింది కానీ రాకుండా చేశారు. వచ్చి ఉంటేనా చిత్తు చిత్తే అని ఓ రేంజిలో గొంతెత్తి స్పీచులిస్తున్నారు నాయకులు. నిజంగా ఉప ఎన్నికలు వస్తే ఏమయ్యేదో మరి. అసలు ఆ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న.  చెత్త రాజకీయం కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘం అంతా అయిందనిపించాక ఈ మాటలెందుకో మరి.


ఇది కదా అసలు కధ  :


తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు చేస్తున్న ఆరోపణ బీజేపీ, వైసీపీ   కుమ్మక్కు అయ్యారని . నిజానికి  ప్రత్యేక హోదా కోసం వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన సంగతి విధితమే. ఆ ఎంపీలు కూడా ఏప్రిల్ 6న రాజీనామాలను స్పీకర్ ఫార్మెట్ లో చేశారు. అంటే అప్పటికి సార్వత్రిక ఎన్నికలకు 14 నెలల గడువు ఉంది.   ఎంపీలు స్వయంగా ఇచ్చిన రాజీనామాలపై నిజానికి స్పీకర్ కి ఏ విధమైన సందేహాలూ ఉండకూడదు.
కానీ లోక్ సభ స్పీకర్ ఎందుకో  పక్కన పెట్టేశారు. ఆమె విచక్షణను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు కూడా. ఆ తరువాత ఆమె జూన్ 3న ఆమోదించారు. అప్ప‌టికి ఒక్క రోజు తేడాలో ఎన్నికలు పెట్టేందుకు గడువు మీరిపోయింది ఇదీ కదా అసలు కధ


కుమ్మక్కు వల్లేనట :


విషయం ఇంత కచ్చితంగా ఉంటే తెల్లరి లేస్తే చాలు తమ్ముళ్ళు వైసీపీ, బేజేపీ కుమ్మక్కు అంటూ పాట అందుకుంటున్నారు. ఎన్నికలు ఎదుర్కోలేకనే ఇలా రాజీ పడ్డారని ఆరోపిస్తున్నారు. ఇందులో లాజిక్ అసలు చూసుకోవడం లేదు. నిజానికి ఉప ఎన్నికలు వస్తే వైసీపీకి విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు సైతం ఘోషించాయి. ప్రత్యేక హోదా అన్నది బర్నింగ్ ఇష్యూ. అలాంటి ఎమోషనలు ఇష్యూ మీద ఎన్నికలకు వెల్తే  అయిదుగురు వైసీపీ ఎంపీలు బంపర్ మెజారిటీతో నెగ్గుతారు కూడా.
ఓ విధంగా ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు జరిపించకుండా వైసీపీ బంగారు అవకాశాన్ని లేకుండా చేసింది. అది చాలదన్నట్లు ఇపుడు టీడీపీ కుమ్మక్కు రాజకీయాంటూ నిందలు వెస్తోంది.


అంత సరదా ఉంటే :


టీడీపీకి ఉప ఎన్నికలు కావాలి. మరి ఆ సరదా తీర్చుకునేందుకు తమ చేతిలో ఉన్న పని ఎందుకు చేయలేకపోయింది. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఫిరాయింపచేసి టీడీపీలో కలిపేసుకుంది. వారి రాజీనామాలు ఆమోదించాలని వైసీపీ పట్టుపడుతూ ఏకంగా అసెంబ్లీనే బాయ్ కాట్ చేసింది కదా. మరి ఏపీ స్పీకర్ ఆ రాజీనామాలు ఆమోదించడం చిటికలో పని. అలా కనుక చేస్తే ఏకంగా 23 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి కదా.


అలా చెయడం మానేసి ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు రాలేదు వస్తే  మా తడాఖ చూపుతామని చెప్పుకొవడం ఉత్తర కుమారుని ప్రగల్బాలే మరి. నిజానికి ఉప ఎన్నికలు అదీ, ఎన్నికల ఏడాది చివర్లో జరిగితే అది అధికార పార్టీకే డేంజర్ సిగ్నల్. ఆ సంగతి ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ బాబు తో సహా టీడీపీ పెద్దలకు తెలియనిది కాదు. కానీ అన్నీ తెలిసి  ఇపుడు ఆడుతోంది మాత్రం అఛ్చ‌మైన ఛెత్త  రాజకీయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: