చంద్రబాబునాయుడుకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఇంట్లో ఐటి దాడులు జరిగాయి. రమేష్ కు చెందిన హైదరాబాద్, కడప, విజయవాడ ఇళ్ళపై ఏకకాలంలో ఐటి అధికారులు దాడులు చేయటం సంచలనంగా మారింది. ఈరోజు ఉదయం కడప, విజయవాడ, హైదరాబాద్ ఇళ్ళపైనే కాకుండా కార్యాలయాలపైన కూడా ఏకకాలంలో దాడులు మొదలయ్యాయి. సుమారు 60 మంది అధికారులు ఒకేసారి దాడులు మొదలుపెట్టారు. మొన్ననే కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి కార్యాలయంపై ఈడీ డాదులు జరగటం, తాజాగా రమేష్ పై ఐటి దాడులతో మంత్రులు, నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.


చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని పలువురు వ్యాపారస్తులు, మంత్రులుపై దాడులు జరుగుతాయని ఎప్పటి నుండో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనతో పాటు కొడుకు లోకేష్,మంత్రులు, నేతలపై దాడులు జరగవచ్చని జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. సరే, చంద్రబాబు కూడా ముదుజాగ్రత్తగా, ప్రజల సానుభూతి కోసమే ఆ ప్రకటనలు చేశారనుకోండి అది వేరే సంగతి. సరే, ఎవరేమనుకున్నా మొత్తానికి టిడిపి నేతలపై ఐటి, ఈడీ దాడులైతే మొదలయ్యాయి.

 

2014 అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో మొదలైన ఇరిగేషన్ ప్రాజెక్టులోలో ఎక్కువ భాగం కాంట్రాక్టులు రమేష్ కంపెనీలకు దక్కుతున్నాయి. అందులో భాగంగానే రమేష్ పై విపరీతమైన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయ్.  ప్రతీ ప్రాజెక్టుకు అంచనా వ్యయాలను పెంచేయటం, పనులు చేయకుండానే కొన్ని సార్లు బిల్లులు చేసుకోవటం లాంటి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అందరు అనుకుంటున్నట్లుగానే దాడులైతే మొదలయ్యాయి.  వైసిపి నుండి ఎంఎల్ఏలు, ఎంపిల ఫిరాయింపులతో పాటు ఓటుకునోటు కేసులో కూడా రమేష్ పాత్ర ఉందన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.  మొన్న సుజనా కార్యాలయాలపై జరిగిన దాడుల్లో విలువైన డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. మరి రమేష్ ఇంట్లో కార్యాలయాల్లో ఏం దొరుకుతుందో చూడాలి.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: