కేంద్ర మంత్రి అయినా ఎంజే అక్బర్ ఇప్పుడు వివాదం లో చిక్కుకున్నాడు. మోడీ మంత్రివర్గంలో విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న ఎంజే అక్బర్ తెలుగు పాఠకులకు కూడా పరిచయస్తుడే. కేంద్రమంత్రి కాక ముందు కూడా ఇతడు తెలుగు పేపర్లు చదివే వాళ్లకు తెలిసిన వ్యక్తే. అందుకు కారణం ఈయన జర్నలిస్టు కావడం. దేశంలోని ప్రముఖ జర్నలిస్టుల్లో ఒకరిగా నిలవడం. ఇక తెలుగు వాళ్లదే అయినా డెక్కన్ క్రానికల్ గ్రూప్‌కు ఎడిటోరియల్ డైరెక్టర్ గా వ్యవహరించాడు అక్బర్.

Image result for mj akbar

ఈయన ఇంగ్లిష్ లో రాసే వ్యాసాలు తెలుగులోకి అనువాదం అయ్యేవి. డీసీకి ఈడీగా ఉన్నన్ని రోజులూ అక్బర్ వ్యాసాలు ఆంధ్రభూమిలో ప్రచురితం అయ్యేవి. చదవడానికి చక్కగానే ఉండేవి ఆ వ్యాసాలు. ఇక ఆ తర్వాత కూడా తెలుగులోకి అక్బర్ వ్యాసాలు అనువాదం అవుతూనే ఉండేవి. ఈయన కేంద్రమంత్రిగా వెళ్లేంత వరకూ ఆ వ్యాసాలు వచ్చేవి. అక్బర్ మరీ బీజేపీకి అనుకూలంగా ఏమీ రాసేవాడు కూడా కాదు.

ఆ కేంద్రమంత్రి అమ్మాయిలను సప్లై కూడా చేసేవాడు!

అలాగని తీవ్రంగా విమర్శించిన జర్నలిస్టూ కాదు. అనూహ్యంగా ఈయనకు బీజేపీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. కేంద్ర మంత్రిపదవిని కూడా ఇచ్చింది. ఇప్పుడు అక్బర్ పై ఆయన దగ్గర పనిచేసిన మహిళా జర్నలిస్టులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మీ టూ క్యాంపెయిన్లో భాగంగా అక్భర్ పై తీవ్రమైన అభియోగాలు వస్తున్నాయి. ఒకరిద్దరు కాదు.. డజన్ల కొద్దీ మహిళా జర్నలిస్టులు అక్బర్ మీద ఆరోపణలు చేస్తున్నారు. అసభ్యంగా మాట్లాడేవాడని, అనుచితంగా ప్రవర్తించేవాడని, లో దుస్తుల్లో చేతులు పెట్టేవాడని.. ఇలా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ తీవ్రమైన ఆరోపణలపై స్పందించడానికి కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ధైర్యం చాలడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: