నాదెండ్ల మనోహర్. రెండు రోజుల బట్టి నలుగుతున్న పేరు ఇది. సినీనటుడు పవన్ కల్యాణ్ పార్టీలో లేటెస్ట్ గా జాయిన్ అయిన మాజీ స్పీకర్. ముందే చెప్పుకున్నట్లుగా మాస్ ఇమేజ్ లేకపోయినా వ్యూహలను రచించడంలో మాత్రం నేర్పరి. జనసేనకు అటువంటి వారు చాలా అవసరం. మరిపుడు జరుగుతున్నది అదే.


ఏడాదిగానట :


కాంగ్రెస్ లో ఉంటూ ఏడాదిగా జనసేనాని పవన్ కు రాజకీయంగా అన్ని రకాల సలహా సూచనలు ఇస్తున్నరుట. అంటే ఓ విధంగా సొంత పార్టీలో విభీషణ పాత్ర అన్న మాట. ఇది నైతికం కాకపోయినా రాజకీయాల్లో దీనికి పెద్దగా విలువ లేదనుకోండి. ఈ మాట జనసేనాని నోట విన్న వారంతా నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందే. అమ్మ నాదెండ్లా అనాల్సిందే. ఆ పార్టీలో ఉంటూ ఈ పార్టీకి సాయం చేయడం అంటే చిన్న విషయంగా చూడకూడదు కదా.


ఆ నిర్ణయాలు నాదెండ్లవే :


పవన్ కి ఇంకా రాజకీయాలు పెద్దగా తెలియవు. ఓ సీనియర్ నాయకుడు పార్టీలో వచ్చి చేరడన్న ఉత్సాహంలో అసలు విషయాన్ని ఇలా బయటేశారు. తనకు అత్యంత‌ సన్నిహితుడు నాదెండ్ల అంటూ అతని ఆలొచనలుతోనే తాను రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నానని కూడా చెప్పేశారు. కేంద్రంపై అవిశ్వాస  తీర్మానం ప్రతిపాదన,కేంద్ర నిధులపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు వంటివి నాదెంద్ల ఆలోచనలేనట.


కీలక స్థానమే :


జనసేనలో ఇపుడు వన్ మాన్ షో జరుగుతోంది. పవన్ అన్ని తానే అయి ఉంటున్నారు. ఇపుడు నాదెండ్ల చేరికతో మరో కీలక నాయకుడు జనానికి కనిపిస్తాడు. జనసేనాని మాటలను బట్టి చూస్తే నాదెండ్లకు పార్టీలో అతి ముఖ్య స్థానమే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొందరలోనే పార్టీని సరైన వ్యూహాలతో వేగంగా ముందుకు నడిపించేలా పగ్గాలను తెర వెనక  నాదెండ్ల పుచ్చుకుంటారని టాక్ నడుస్తోంది.


వల వేస్తారా :


నాదెండ్ల మనోహర్ తన పలుకుబడిని ఉపయోగించుకుని ఇతర పార్టీల నాయకులను కూడా జనసేన వైపు నడిపించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన కాంగ్రెస్ లో ఇంకా మిగిలిన వార్తితో పాటు మాజీ కాంగ్రెస్, తాజా వైసీపీ లీడర్లను కూడా ఇటు వైపుగా రప్పించగలరని ఆశిస్తున్నారు. అంతే కాదు.టీడీపీలోని నాయకులను కూడా  ఆకర్షించడం ద్వారా జనసేనకు జవసత్వాలు  తెచ్చేందుకు నాదెండ్ల రంగంలోకి దిగుతారని కూడా వింపిస్తోంది. మొత్తానికి నాదెండ్ల జనసేనలో ఇపుడు ఓ పవర్ ఫుల్ నాయకుడే. నో డౌట్.


మరింత సమాచారం తెలుసుకోండి: