క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు బలపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులు సంబంధించి ప్రతిపక్షాలైన వైసిపి- బిజెపిల మధ్య అప్రకటిత ఒప్పందం ఒకటి జరిగిందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్ధులను రెడీ  చేసుకుంటున్నాయి. ఒకవైపు పాదయాత్రలో వైఎస్ జగన్ కొన్ని చోట్ల ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించారు. మరికొన్ని నియోజవర్గాకల్లో సమన్వయకర్తలను మార్చేస్తున్నారు.

 

ఇక, చంద్రబాబునాయుడు కూడా కొన్ని నియెజకవర్గాల్లో క్యాండిడేట్లను ఫైనల్ చేసేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధుల కోసం కసరత్తు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో అభ్యర్ధిగా పితాని బాలకృష్ణను ప్రకటించారు. సరే, కాంగ్రెస్, వామపక్షాలు పెద్ద లెక్కలోకి రావనుకోండి.


ఇక మిగిలింది బిజెపి మాత్రమే. ఆ పార్టీ లోలోపల కసరత్తులు చేస్తున్నట్లు ప్రాచారం జరుగుతోంది లేండి. ఈ నేపధ్యంలోనే ఒక సమాచారం వెలుగు చూసింది. అదేమిటంటే, ఒక పార్టీ నేతకు మరో పార్టీ టిక్కెట్టు ఇవ్వకూడదనేది ఒప్పందమట. నియోజకరవర్గం నుండి టిక్కెట్లు ఆశించే వారు వైసిపిలో చాలామందే ఉంటారు. అదే సమయంలో బిజెపికి చాలా నియోజవర్గాల్లో అసలు గట్టి అభ్యర్ధులే దొరకటం లేదు.


వైసిపిలో టిక్కెట్లు రాని నేతలు టిడిపిలోకి వెళ్ళలేక బిజెపిలోకి దూకి టిక్కెట్ల కోసం ప్రయత్నించే అకాశాలున్నాయి. అటువంటి వారిని ప్రోత్సహించకూడదని రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని ప్రచారం జరుగుతోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా ఆ ప్రచారానికి ఊపునిస్తోంది. దగ్గుబాటి పురంధేశ్వరి, రావెల కిషోర్ బాబు, కొణతాల రామకృష్ణ త్వరలో వైసిపిలో చేరుతాని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది.

 

అయితే, తాజాగా జనసేన తరపున పోటీ చేయబోయే లిస్ట్ అంటూ ఓ జాబితా ప్రచారంలోకి వచ్చింది. దాని ప్రకారం బిజెపి నేత పురంధేశ్వరి జనసేన తరపున ఒంగోలు ఎంపిగా పోటీ చేస్తారట. అలాగే, వైసిపి నేత లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు 2 నుండి అసెంబ్లీకి పోటీ చేస్తారట. జనసేన తరపున పోటీ చేయబోయే వారిలో బిజెపి ఎంఎల్ఏ ఆకుల సత్యనారాయణ, ఎంఎల్సీ సోము వీర్రాజు, వంగవీటి రాధా తదితరుల పేర్లున్నాయి. నిజానికి పురంధేశ్వరి వైసిపిలో చేరుతారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతోంది.


పురంధేశ్వరి వైసిపిలో చేరితే కొడుకు చెంచురామ్ కు పరుచూరు అసెంబ్లీ టిక్కెట్టు ఖాయమనే ప్రచారం ఉంది. కానీ హఠాత్తుగా దగ్గుబాటి దంపతుల పేర్లు జనసేన తరపున వినబడుతోంది. దగ్గుబాటి దంపతుల పేర్లంటే సరే, మరీ మాజీ మంత్రి రావెల, కొణతాల పేర్లు  కూడా జనసేన తరపున ఎందుకు వినబడుతోందో అర్ధం కావటం లేదు. అయితే, సోము వీర్రాజు పేరు కూడా జనసేన తరపున వినబడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: