పదే పదే ఒకే మాటను అంటూ ఏవో సంబంధాలు అంటకడితే ఎవరికైనా  తిక్క లేస్తుంది.  మరి ఓ లెక్కలో తిక్క ఉన్న వారికి ఇంకా చెప్పాలా. కాదు మొర్రో అని మొత్తుకుంటున్నా అవే నిందలు పదే పదే వేస్తూంటే చిర్రెత్తుకొచ్చింది కాబోలు. అంతే ఓ స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చేశాడు. చెప్పిన మాటనే చెప్పుకుంటూ పోతే అవి నిజాలు కావంటూ అటాక్ చేశాడు.


వాళ్ళతో లింకేంటి :


మాటకు వస్తే చాలు బీజేపీతో జనసేనకు లింక్ కట్టేస్తున్నారు తమ్ముళ్ళు. పవన్ కమలనాధులూ కలసిపోయారంటూ ఓ రేంజిలో కధలు అల్లేస్తున్నారు. మరి మీడియతో రోజూ ఎవరూ వివరణలు ఇవ్వలేరుగా. అందుకే సరైన సమయం చూసి పవన్ కళ్యాణ్ ఘాటైన రిప్లై ఇచ్చేశాడు. అవును మరి వారి మద్దతు తీసుకోవడానికి బీజేపీ వాళ్ళు నాకు బంధువులు అవుతారు మరి అంటూ సెటైర్లు వేశాడు.
అంతటితో ఆగకుందా మోడీ నాకు బ్రదర్ అయితే అమిత్ షా నాకు బాబాయి కదా అంటూ కౌంటరేశాడు. అసలు బీజేపీతో నాకు సంబంధం ఎందుకు ఉంటుందని కూడా పవన్ గట్టిగానే ప్రశ్నించాడు.


ఆగుతారా :


మరి పవన్ బాబు ఇంత క్లారిటీగా పక్కాగా విషయం వివరించాకైనా టీడీపీ తమ్ముళ్ళ గొంతులు మూతపడతాయా, బీజేపీతో లింక్ పెట్టకుండా ర్యాగింగ్ ఆపుతారా అంటే నో అనే సమాధానం వస్తుంది. అవును మరి అది టీడీపీ శిక్షణలో నేర్ఛుకున్న పాఠాలు. ఎవరేమనుకున్నా తాము చెప్పాల్సిన దాన్ని ఒకటికి పది మార్లు చెప్పడం, అనుకూల మీడియా ద్వారా ప్రచారంలోకి తేవడం ద్వారా జనాల్లో దాన్నే నిజం అని నమ్మించే ప్రయత్నం చేయడమే కదా టీడీపీ తమ్ముళ్ళ పని. అలాటపుడు వాళ్ళు ఎందుకు ఆపుతారు.


మొత్తానికి పవన్ లో దూకుడు బాగానే కనిపిస్తోంది. కొత్త చేరికలతో ఆయన ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. ఇకపై ఇదే స్పీడ్ లో ఆయన టీడీపీ ని బాగానే అటాక్ చేస్తాడేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: