ఎంత పెద్ద ధీమా ఉంటే ఈ మాట నోట వస్తుంది మరి. మొత్తానికి మొత్తం గెలిచేసుకుంటామంటే ఎంత బలం, బలగం ఉండాలి మరి. ఇవన్నీ లెక్కలు చూసుకునే వారికేనా. లేకపోతే రాజకీయాలు కూడా సినిమాల తంతుగా మారాయకుందామా. మా సినిమా సూపర్ హిట్ అని చెప్పుకోవడమే కానీ లోపల జనం లేని ధియేటర్లు చూస్తూనే ఉన్నాం కదా. నయా పొలిటికల్ ట్రెండ్ కూడా అంతేనేమో.


అన్నీ సీట్లూ వాళ్ళవే:


పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి రాను రానూ విదూషకుడైపోతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూంటే కంగారో, బేజారో లేక కలవరింతలో  తెలియదు కానీ ఆయన ఇస్తున్న భారీ స్టేట్మెంట్లు ఒక్కొసారి  నవ్వు పుట్టిస్తున్నాయి. ఏపీలో మొత్తం పాతిక లోక్ సభ సీట్లనూ తామే గెలుచుకుంటామని చెప్పడం ఇందులో భాగంగానే చూడాలి. ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు వస్తే ఆరేడు శాతం ఓట్లు కంటే ఎక్కువ రావు అని ఓవైపు సర్వేలు ఘోషిస్తూంటే రఘువీరా మాత్రం అన్నీ మావేనంటూ దప్పాలు కొట్టడంలో చంద్రబాబునే మించిపోతున్నారు.


ఓ వైపు జారుకుంటున్నారు  :


ఇక చూస్తే ఓ వైపు కాంగ్రెస్ నాయకులు వరసగా క్యూ కట్టి బయటకు పోతున్నారు. కాంగ్రెస్ లో ఉక్కబోత భరించలేకే వారు అలా దయచేస్తున్నారనుకోవాలి. మరో వైపు ఉన్న పాటి క్యాడర్ కూడా అయోమయంలో పడిపోయింది. సీన్ ఇలాగుంటే రఘువీరా మాత్రం గెలుపు మాదేనని ఎలా చెప్పగలుగుతున్నారో మరి. ఎంత రాహుల్ బాబు ప్రత్యేక హోదా ఇస్తానంటే మాత్రం విభజన గాయలు మరచి జనం గుడ్డిగా ఓట్లేస్తారా


విలువల్లేవుట :


రఘువీరారెడ్డి గారు నాదెండ్ల మనోనర్ ని అనరాని మాట అనేసారు. ఆయనకు రాజకీయంగా ఎటువంటి విలువలూ లేవని ఘాటైన కామెంట్ చేశారు. నాలుగేళ్ళు కాంగ్రెస్ లో ఉంటూ జనసేనకు సలహా సూచనలు ఇచ్చారంటేనే అర్ధం చేసుకోవచ్చునని అంటున్నారు. జనసేనలో ఉండి రేపు మరో పార్టీకి కూడా ఇలాగే సహకరిస్తారేమో చూసుకోమంటూ పవన్ కి కూడా సున్నితమైన వార్నింగు  కూడా ఇచ్చేశారు. మొత్తానికి కాంగ్రెస్ కి మంచి రోజులు అంటున్న రఘువీరా ఏపీకి తానే రేపటి  ముఖ్యమంత్రిని అన్న ఒక్క మాట మాత్రం అనకుండా వదిలేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: