ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమావేశాలు ఏపీ ప్రజలను రసవత్తరంగా మారుస్తున్నాయి. అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీపై ప్రతిపక్ష పార్టీ వైసీపీ అలాగే మూడవ ప్రధాన పార్టీ అయిన జనసేన పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసినదే. మొదటి నుండి చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తూనే ఉన్నారు...ప్రతిపక్ష నేత జగన్ తన కర్తవ్యాన్ని ప్రశ్నించే రూపంలో చంద్రబాబుని నిలదీస్తున్నారు.

Image may contain: 1 person, sitting and beard

అయితే మరోపక్క 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి తాజాగా రాజకీయ సమీకరణాలు బట్టి చంద్రబాబుపై తిరగబడి బయటకు వచ్చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పార్టీ తరపున రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న క్రమంలో చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. అయితే తెర ముందు వీరిద్దరూ (చంద్రబాబు, పవన్ కళ్యాణ్) ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న కానీ తెర వెనకాల మాత్రం జరుగుతున్నది వేరే అని ఏపీ పాలిటిక్స్ లో వినపడుతున్న హాట్ టాపిక్.

Image result for pawan kalyan chandrababu

ఇంతకి విషయం ఏమిటంటే రాజధాని ప్రాంతంలో బడా పారిశ్రామికవేత్త గా పేరొందిన లింగమనేని రమేష్ వీరిద్దరి మధ్య మధ్యవర్తిగా ఉంటూ ఏపీ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న వార్త. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అమరావతిలో తీసుకున్న ఇంటి స్థలం విషయంలో లింగమనేని రమేష్ పాత్ర చాలా పెద్ద దేనని వార్తలు కూడా విన్నబడయి. మరి అదేవిధంగా ఏపీలో లింగమనేని ఎస్టేట్స్ వ్యాపారాలకు చంద్రబాబు వెన్నుదన్నుగా ఉన్నారంటూ  గత కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి.

Related image

ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో వైసిపి అధినేత జగన్ గెలుపు దిశగా దూసుకుపోతున్న క్రమంలో..జగన్ ని నిలువరించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నట్లు..పైకి కనబడుతూ వెనక చీకటి ఒప్పందం కుదిరినట్లు వైసిపి పార్టీకి చెందిన కొంతమంది నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుమూలంగా అనే ఇటీవల జనసేన పార్టీ లోకి నాదెండ్ల మనోహర్ రావడం వెనుక కూడా లింగమనేని రమేష్ హస్తమున్నట్లు ప్రతిపక్ష పార్టీకి చెందిన కొంతమంది నేతలు గుసగుసలాడుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అంత డ్రామా అని..జగన్ ని నిలువరించడానికి ఏపి ప్రజలను మోసం చేస్తూ ఇద్దరు ఆడుతున్న రాజకీయ క్రీడ అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విపక్ష పార్టీకి చెందిన కొంతమంది నేతలు.




మరింత సమాచారం తెలుసుకోండి: