టీడీపీ నేతలు జగన్ మీద విమర్శలు చేసే నేపధ్యం లో చాలా శృతి మించుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉత్తరాంధ్ర ప్రజలు తరిమి కొట్టాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రజలను ఆదివారం కోరారు. జగన్ ఇప్పటి వరకు టిట్లీ తుఫాను బాధితులను పరామర్శించలేదని విమర్శించారు. సైకోలా మారిన వైయస్ జగన్ ప్రజల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

జగన్ పారిపోయారు

అదే సమయంలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా విమర్శలు గుప్పించారు. ఉత్తారంధ్ర గురించి పదేపదే మాట్లాడే పవన్ తుఫాను బాధితుల గురించి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. కాగా, పవన్ ఈ నెల 17, 18 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జగన్ టిట్లీ బాధితులను పరామర్శించలేదని, కాబట్టి ఆయనకు పాదయాత్ర చేసే అర్హత లేదని బుద్ధా వెంకన్న అన్నారు.

 మేం ఏసీ గదుల్లో కూర్చుంటే నిలదీయాలి

ప్రజా సమస్యలపై స్పందించలేనటువంటి, ప్రజలు కష్టాల్లో ఉంటే హైదరాబాద్ పారిపోయినటువంటి జగన్‌కు ఎలాంటి అర్హత ఉందని ప్రజల గురించి మాట్లాడుతారని నిలదీశారు. కానీ ఇవాళ ప్రతిపక్ష నేత జగన్ పారిపోయి, అధికారంలో ఉన్న చంద్రబాబు వెళ్లారని, కాబట్టి జగన్‌కు ప్రతిపక్ష నేతగా ఉంటే అర్హత లేదని బుద్ధా వెంకన్న అన్నారు. ఆయన వెంటనే ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా వచ్చే అలవెన్సులు కూడా తీసుకోవద్దని చెప్పారు. ప్రజలపై అభిమానం ఉంటే జగన్ ఇలా చేయాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: