పార్టీలు, సిద్ధాంతాల రోజులు పోయాయి. వ్యక్తులు,  ఆరాధనలు మొదలయ్యాయి. ఎంత బాగా భజన చెస్తే అంత గొప్పగా పదవులు వస్తాయి. వారే నాయకులు అవుతారు. వారే జాగ్రత్తగా పైరవీలు చేసుకోగలుగుతారు. జెండా పట్టి జనంలో ఉన్న వారు ఇపుడు ఎందుకు కానీ వారే అవుతున్నారు. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ టీడీపీలో అదే గోల ఇపుడు.


సీబీఎన్ ఆర్మీట :


సీబీఎన్ ఇది షార్ట్ కట్. ఫుల్ ఫార్మ్ లో చంద్రబాబునాయుడు ఆర్మీ అన్న మాట. బాబు సామాజిక వర్గానికి చెందిన వారు ఇందులో చేరి భజన లెవెల్స్ ని పీక్స్ తీసుకుపోతున్నారు.   అసలైన తమ్ముళ్ళ కంటే ఈ కొసరు బ్యాచ్ ఇపుడు ఎక్కువయ్యారు. వారే అన్నిటా హైలెట్ అవుతున్నారు. టీడీపీ మీటింగుల్లోనూ వీరిదే హవా. దీంతో తమ్ముళ్ళకు తంటాలు తప్పడంలేదు.


తెలుగు యువత ఏదీ :


చాలా ఆశ్చర్యకరమైఅన్ సంగతి ఏంటంటే టీడీపీకి పునాది లాంటి  తెలుగు యువత అధ్యక్ష పదవి ఇప్పటికి ఖాళీగా ఉండి పదేళ్ళు అవుతోంది. 2008లో చివరిసారిగా బీద మస్తాన్ రావు ఈ పదవిని చేపట్టారు. ఒకప్పుడు నందమూరి హరిక్రిష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వర రావు వంటి ఉద్దండులు చేపట్టిన ఈ పదవి ఇపుడు ఖాళీగా ఉండడం దారుణమే. అలాగే తెలుగు విధ్యార్ధి తదితర అనుబంధ కమిటీలు ఖాళీగానే ఉన్నాయి.


ఆ స్థానంలో  ఆర్మీ :


ఇపుడు ఆ ఖాళీల్లోకి సీబీఎన్ ఆర్మీ ప్రవేశించింది. ఎక్కడ చూసినా వీళ్లదే హడావుడి. ఆఖరుకు మహానాడులోనే వీరే అన్నింటా కనిపిస్తున్నారట. పెదబాబు, చినబాబు సైతం వీరినే ఆదరించడంతో టీడీపీ జెండా మోస్తున్న సిసలైన క్యాడర్ కు మండిపోతోంది. వీరు సొంత సామాజిక వర్గం వారు కాబట్టే అంతటి ఆదరణ అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి.


అది లోపమేనా :


ఇదిలా ఉండగా ఈ ఆర్మీ పేరు చెప్పుకుని కొంతమంది పైరవీలు కూడా చేస్తున్నారని, సచివాలయంలో వారిదే హవా అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పటిష్టమైన సంస్థాగత నిర్మాణం అని చెప్పుకునే టీడీపీలో ఈ తరహా పోకడలు పార్టీని ఎక్కడకు తీసుకెళ్తాయోనని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అర్హులను గుర్తించి వారికి యువత, విధ్యార్ధి వంటి కీలక పదవులు అప్పగించకపోతే అది టీడీపీకే శాపంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: