అన్న కంటే తమ్ముడు ఘనుడే. అట్నుంచి  నరుక్కు వస్తున్నారు. అనుభవం కావాలి అంటూనే బాగానే గడించేశారు. ఎంతైనా బాబు సావాసం కదా ఇపుడు పవన్ రాటుదేలిపోయారు. తాను వద్దు అంటూనే కావాలనుకున్నది చెప్పేస్తున్నారు. కాదు అంటూనే అదే కోరుకుంటున్నారు. మొత్తానికి పవన్ ఫక్త్ పొలిటీషియన్ అవతారం ఎత్తేశారు.


ర్యాలీగా కాపులు :


పవన్ బలం బలహీనత రెండూ కులమే. ఇపుడు ఆయన దాన్నే బలంగా, పార్టీకి మూలాధారంగా మార్చుకుంటున్నారు. నేను కాపును కాదు, అన్ని కులాలూ సమానమేనని బయటకు చెబుతున్నా లోపల పవన్ చేయాల్సింది చేసేస్తున్నారు. తన చుట్టూ వారినే తిప్పుకుంటున్నారు. ప్రధానంగా ఆ రెండు జిల్లాలపై కన్నేసి మరీ రాజకీయాన్ని  రక్తి కట్టిస్తున్నారు. కాపులు ఇపుడు పవన్ వెంట పడుతున్నారు. పడేలా ఆయన చేసుకున్నారు.


కవాతులో కనిపించింది :


జనసేనాని కవాతు పిలుపు ఇస్తే వెల్లువలా స్పందన లభించింది. ఈ మధ్య కాలంలో అంతటి రెస్పాన్స్ మరే పార్టీకి లేని విధంగా లక్షలాది మంది పవన్ కోసం తరలివచ్చారు. వాళ్ళ్లో అత్యధికులు కాపులేనని ఇంటలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నారు. అంటే కాపులు తమ పార్టీగా జనసేనను సొంతం చేసుకున్నారనిపిస్తోంది. పవన్ని రేపటి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఆ ఆవేశమే వారిని అలా కవాతు వైపుగా కదిలించింది. నడిపించింది.


మరో ప్రయత్నం :


చాలామంది ఒక మాట అనుకున్నారు. ప్రజారాజ్యం అనుభవాలతో జనసేన వైపు కాపులు తొంగి చూడరని, కానీ జరిగేది మాత్రం అందుకు విరుధ్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. కాపులకు ఉమ్మడి ఏపీలో సీఎం యోగం లేదు. కనీసం విభజన ఏపీలో మెజారిటీ కులంగా ఉన్న తమ నుంచి ముఖ్యమంత్రి రావాలన్న కోరిక వారిని జనసేన వైపుగా తీసుకెళ్తోందనిపిస్తోంది. గతం నుంచి గుణపాఠం నేర్చుకుని ఈసారి తామే చక్రం తిప్పాలని కూడా అనుకుంటున్నారు. వారికి కేంద్ర బిందువుగా మారడంలోనే పవన్ విజయం దాగుంది.


కాపు జేఏసీ కూడా :


ఇక ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నా కాపు జేఏసీ కూడా ఇపుడు పవన్ వైపు చూస్తోంది.  టీడీపీని వద్దనుకున్న జేఏసీకి వైసీపీ హ్యాండ్ ఇచ్చింది. ఇపుడు జనసేన ఒక్కటే ప్రత్యాన్మాయంగా ఉంది. పైగా పవన్ కూడా ఆ సామజిక వర్గీయుడు కావడంతో ఇటు బీసీ నినాదం తో పాటు, అటు కాపు సీఎం ఆశలు కూడా ఒకేమారు నెరవేర్చుకోవాలనుకుంటున్నారట. మొత్తానికి పవన్ సామాన్యుడు కాదన్నది కవాతు చెప్పింది. ఇక వచ్చిన జనాన్ని చూసిన టీడీపీ హడలిపోతోంది. తమకు గుత్తమొత్తంగా ఓట్లూ, సీట్లు వచ్చిన చఒటనే పవన్ శంఖం పూరించాడని అర్ధమైపోయింది. అందుకే పవన్ మీద తమ్ముళ్ళు గత రెండు రోజులుగా విరుచుకుపడుతున్నారు.
]



మరింత సమాచారం తెలుసుకోండి: