కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నాలుగు రోజుల క్రితం జనసేనలో చేరిన విషయం తెలిసిందే. నిజానికి నాదెండ్లకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్దగా సాన్నిహిత్యం లేదు. పైగా వైసిపిలో  చేరే విషయంలో ఎప్పటి నుండో మనోహర్ కు వైసిపి నేతలకు చర్చలు జరుగుతున్నాయి. అటువంటి సమయంలోనే నాదెండ్ల జనసేనలో  చేరాలని హఠాత్తుగా నిర్ణయించుకోవటంతో  అందరూ ఆశ్చర్యపోయారు.

  

సంస్ధాగతంగా కానీ పార్టీ పరంగా కానీ వైసిపి ముందు జనసేన ఎందుకూ పనికిరాదు. పైగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది వైసిపినే అనే ప్రచారం బాగా జరుగుతోంది. ఈ విషయాలన్నీ మనోహర్ కు తెలియందు కూడా కాదు. అయినా నాదెండ్ల వైపినిని కాదని జనసేనను ఎందుకు ఎంచుకున్నారు ? ఇపుడిదే అందరిని వేధిస్తున్న ప్రశ్న.  ఇక్కడే ఓ సమాచారం తాజాగా చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేమిటంటే, నాదెండ్లకు, పవన్ కు మధ్య విజయవాడ కు చెందిన ఓ బడా పారిశ్రామికవేత్త మధ్యవర్తిత్వం చేశారనేది సమాచారం. ఆ పారిశ్రామికవేత్త చంద్రబాబునాయుడు సామాజికవర్గానికి చెందిన వ్యక్తే కాకుండా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహిత కోటరిలో ఒకరుగా ప్రచారంలో ఉన్నారు.

 

 అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమిటంటే నాదెండ్ల జనసేనలో చేరటం వెనుక బహుశా తెరవెనుక చంద్రబాబు ప్రోద్బలం కూడా ఉండే ఉండచ్చు. వ్యక్తిగత సమస్యల వల్ల నాదెండ్ల తెలుగుదేశంపార్టీలో చేరలేరు. అదే సమయంలో జనసేనలో ఇప్పటి వరకూ  చేరిన వారిలో అత్యధికులు కాపులే అనే ప్రచారం జరుగుతోంది. దాంతో ఇతర సామాజికవర్గం నేతలు అందులోను కమ్మ సామాజికవర్గం నేతలు  జనసేనకు చాలా అవసరం. కాబట్టే సదరు పారిశ్రామికవేత్త మనోహర్, పవన్ కు మధ్యవర్తిత్వం చేయగానే ఇద్దరు సానుకూలంగా స్పందించారట. అందుకే మొన్న పవన్, మనోహర్ తిరుమల వెళ్ళినపుడు సదరు పారిశ్రామికవేత్త కూడా వాళ్ళతో కలిసి తిరుమల వెళ్ళారు. 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: