ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కాలంలో తరచు సహనాన్ని కోల్పోతున్నారు. ఆయన ఏం మాట్లాడినా చికాకు ధోరణి కనిపిస్తోంది. నచ్చని విషయాలు, పార్టీల గురించి చెప్పాల్సివస్తే ఓ రేంజిలో గుస్సా అవుతున్నారు. అది వయసు పెరుగుతూండడం వల్ల వచ్చిన ప్రభావమా, లేక అభద్రతాభావమా అన్నది తెలియడంలేదు.


సిక్కోలులో వీరంగం :


తిత్లీ తుపాను బాధితులను పరామర్శించడానికి బాబు సిక్కోలులో ఉంటున్న సంగతి విధితమే ఈ సందర్భంగా ఆయన వద్దకు తమ బాధలు చెప్పుకుందామని బాధితులు వస్తున్నారు. అదే సమయంలో కొంతమంది గట్టిగా నిలదీస్తున్నారు. దీంతో బాబు సహనం కోల్పోతున్నారు. మిమ్మల్ని ఎవరు పంపించారో తెలుసు, వెనక ఎవరు ఉన్నా లెక్కచేయను, అందరి తోకలు కత్తిరిస్తానంటూ ఘాటైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసలే అన్ని కోల్పోయి పుట్టెడు బాధలో ఉన్న వారిపైన బెదిరింపు ధోరణితో బాబు మాట్లాడంతో వారు మరింతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఆ ఇద్దరిపైనా ఫైర్ :


జగన్ పైన బాబు యధా ప్రకారం తుపాను ప్రాంతాలలోనూ వదలకుండా తిట్ల దండకం అందుకుంటున్నారు. జగన్ చేసే రాజకీయాలు తాను ఎదుర్కొంటానని, తాను పరామర్శకు  రాకుండా గూండాలను పంపుతున్నారని, సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చేశారు. ఇక పవన్ మీద బాబు విరుచుకుపడ్డారు. నిన్నటివరకు నా పక్కన ఉన్న పవన్ ఇపుడు ఎదురుగా నిలబడి తిట్టడమేంటని బాబు నిలదీస్తున్నారు. పవన్ ది కపట ప్రేమని,  బాధితులపైన ఆయన‌కు నిజంగా అభిమానం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. 


అరకొర సాయం :


ఇదిలా ఉండగా సిక్కోలుల పరిస్థితి వేరేగా ఉంది. అక్కడ రేషన్ సరకును ఉచితంగా ఇమ్మంటే కొంతమంది డీలర్లు  చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. మరో వైపు వితరణలు, సహాయాలు కూడా లెక్కలు తేలడంలేదు. తమ్ముళ్ళు కొంత మంది పక్క దోవ పట్టిస్తున్నారని ఆరోపణలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి. దీంతో జనం కూడా తమకు ఏవీ అందడంలేదని అంటున్నారు. వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకోకుండా చంద్రబాబు ప్రతిపక్షాలపైన విమర్శలు చేయడమేంటని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: