బీసీలు మాట ఇస్తే వెనక్కు తగ్గరు. ఓ పార్టీకి కాపు కాస్తే గెలిపించుకుని తీరుతారు. పదవుల కంటే ఆత్మాభిమానమే మిన్నగా వారు రాజకీయాల్లో మనగలుగుతున్నారు. కాంగ్రెస్ హయాంలో  నిరాదరణకు గురి అయిన బీసీలు అన్న నందమూరి వెంట నడిచారు. ఆ తరువాత టీడీపీకే ఓటు బ్యాంక్ గా మారిపోయారు. దశాబ్దాల తరువాత బీసీలు మళ్ళీ పునరాలోచనలో పడ్డారా  అంటే సమాధానం అవుననే వస్తోంది.


టీడీపీ వెన్నంటి :


నిజానికి బీసీలకు రాజకీయంగా గుర్తింపు గౌరవం నందమూరి జమానాలో బాగా దక్కాయంటారు. చంద్రబాబు ఆ తరువాత నామమాత్రంగా పదవులు అధికారం ఇచ్చి వారిని పక్కనే ఉంచుతున్నారన్న అసంత్రుప్తి కూడా ఉంది. దీనికి తోడు చాలాకాలంగా బీసీలో ఓ అనుమానం ఉంది. కాపులను చేరదీయడం, వారికే కీలక పదవులు అప్పగించడంతో కొన్నాళ్ళుగా టీడీపీపై బీసీలు చాలా అసంత్రుప్తి గా ఉన్నారు.


జగన్ వైపుగా :


మారుతున్న సామజిక వర్గ సమీకరణల్లో బీసీలు వైసీపీ వైపు చూస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలలో చూసుకుంటే నూటికి ఎనభై శాతం వరకూ బీసీలే ఉన్నారు. జగన్ రెండు నెలలుగా చేస్తున్న పాదయాత్రకు బీసీలు బ్రహ్మరధం పడుతున్నారు.  అలాగే గోదావరి జిల్లాల్లో సైతం బీసీలు జగన్ వెన్నటి ఉన్నారు. రాజమండ్రీ ఎంపీ సీటు జగన్ బీసీలకు కీటాయించడం వెనక కూడా వ్యూహం ఉంటుందని అంటున్నారు. 


కాపులను పక్కన పెట్టారా :


ఈ నేపధ్యంలోనే జగన్ కూడా కాపులను నమ్ముకుని రాజాకీయాలు చేయలేమని నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీలో ఉన్న బలమైన కాపు నాయకులను పక్కన పెడుతూనే బీసీలకు జగన్ పెద్ద పీట వేస్తున్నారు. మొత్తానికి 2014 ఎన్నికలకు భిన్నంగా సామాజిక సమీకరణలు ఉంటాయని నమ్ముతూ జగన్ రాజకీయాలు చేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. తెలుగుదేశం పార్టీ దీన్ని ఎలా ఎదుర్కొంటుందో కూడా ఆలోచించాల్సిన విషయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: