తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ చుట్టూ ఐటి ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లే ఉంది. మూడు రోజుల పాటు రమేష్ కు చెందిన ఇళ్ళు, కార్యాలయాల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాల్లో భాగంగా కీలకమైన డాక్యుమెంట్లు, పెన్ డ్రైవులు, హార్డ్ డిస్కులు తీసుకెళ్ళారు. ఆ తర్వాత రిత్విక్ ప్రాజెక్ట్స్ అకౌంటెటును విచారించినపుడు కీలకమైన సమాచారం దొరికిందని తెలుస్తోంది. డొల్ల కంపెనీలకు సంబంధించిన విషయాలు బయటపడ్డాయట.

 

అకౌంటెట్ చెప్పిన ప్రకారమైతే రూ 100 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగగినట్లు సమాచారం. రిత్విక్ ప్రాజెక్ట్స్ నుండి రూ 74 కోట్ల మేరకు గుర్తుతెలీని లావాదేవీలు జరిగాయట. పై మొత్తానికి లెక్కలు చెప్పమని అడిగినపుడు అకౌంటెట్ సాయిబాబా చెప్పలేకపోయారట. అలాగే మరో రూ 25 కోట్లకు అనుమానాస్పదమైన బిల్లులు దొరికినట్లు తెలిసింది. రిత్విక్ ప్రాజెక్స్ట్ నుండి సుమారు 6 సంవత్సరాలుగా ఎడ్కో ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి  రూ 12 కోట్లు చెల్లించినట్లు గమనించారు. ఎడ్కో కంపెనీ కార్యకలాపాలేంటి ? కంపెనీ ఎక్కడుందని అడిగినపుడు సాయిబాబా ఏమీ  సమాధానం చెప్పలేదట.

 

అకౌంటెట్ వాలకం చూసిన తర్వాత ఎడ్కో కంపెనీ డొల్ల కంపెనీ అని ఐటి అధికారులు అనుమానిస్తున్నారు. తమ్ముడు పేరుతో పది డొల్ల కంపెనీలను పెట్టి కోట్ల రూపాయలు దారి మళ్ళించారని మొదటి నుండి ఐటి అధికారులు అనుమానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుమానాన్నే అకౌంటెట్ విచారణ కూడా నిర్ధారిస్తోందట. డొల్ల కంపెనీల అడ్రస్సులన్నీ కేవలం పేపర్లకే పరిమితిమని, క్షేత్రస్ధాయిలో కంపెనీల కార్యాలయాలు ఎక్కడా కనిపించటం లేదని ఐటి అధికారులు నిర్ధారించుకున్నారట.


ఆమధ్య కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, మాజీ ఎంఎల్ఏ బీద మస్తాన్ రావు, ఎంఎల్ఏ పోతుల రామాారావుతో పాటు పలువురు వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలపైన కూడా ఐటి, ఈడి దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఐటి దాడులకు గురైన వారంతా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులే కావటం గమనార్హం. దాంతొ టిడిలొ గగ్గోలు మొదలైపోయింది. 


ఎలాటంటే, ఎడ్కో కంపెనీకి చెందిన సీళ్ళు, స్టాంపులు కూడా అకౌంటెట్ దగ్గరే దొరికాయి. అదేవిధంగా రిత్విక్, ఎడ్కో కంపెనీల మధ్య ఉత్తర ప్రత్యత్తురాలు కూడా ఈ మెయిల్స్ లో మాత్రమే కనబడుతున్నాయట. దాంతో అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం అదొక డొల్ల కంపెనీగా ఐటి అధికారులు అనుమానిస్తున్నారు. చూడబోతే త్వరలో మరిన్ని డొల్ల కంపెనీల బండారం బయటపడేట్లే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: