వైఎస్ జగన్ నమ్మింది చేస్తారు. ముక్కుసూటిగా పోతారు. ఒకటి అనుకుంటే ఎక్కడా వెనక్కు తగ్గరు. అది ఆయన నైజం. అదే రాజకీయాల్లో కొన్ని సార్లు ప్లస్ అవుతోంది. అనేకసార్లు మైనస్ అవుతోంది. పట్టు విడుపు ఉంటేనే రాజకీయం అంటారు. మరి విడుపు లేని చోట విమర్శలు వెల్లువెత్తున్నాయి. జగన్ మాత్రం నా రూటే సెపరేట్ అంటున్నారు.


దొరికిపోయారుగా :


ఈయనకు కోర్టులకు వెళ్ళడానికి టైం ఉంటుంది. వెళ్ళకపోతే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఇక్కడ తుపాను వచ్చి జనం చచ్చిపోతూంటే మాత్రం రావడానికి తీరిక ఉండదు. అవసరం అయితే ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకుంటారు కానీ ఇక్కడకు రారు. ఇదీ జగన్ పై బాబు చేసిన హాట్ కామెంట్స్. ఇందులో నిజం ఉందనిపిస్తోంది కదూ మరదే అడ్డంగా దొరికిపోవడం అంటే. తిత్లీ తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్ వెళ్ళకపోవడాన్ని బాబు ఆయుధంగా మార్చుకుని శర సంధానం చేస్తున్నారు.


పక్కనే ఉన్నారుగా :


నిజం. జగన్ ఆ పక్కనే ఉన్న విజయనగరంలో ఉన్నారు. అంటే కూత వేటు దూరంలో. మరో వైపు శ్రీకాకుళంలో  ఘోరమైన ప్రక్రుతి విపత్తు వచ్చి జనం అల్లల్లాడిపోయారు. ఈ టైంలో అధికారం పక్షం కంటే వేగంగా ప్రతిపక్షం వాలిపోవాలి. విమర్శలు ఇటు వైపు నుంచి ఉండాలి. పాలక పక్షన్ని గుక్క తిప్పుకునేందుకు కూడా వీలులేకుండా చేయాలి. మరి వైసీపీ అధినేత ఏం చేస్తున్నారు. మొత్తానికి మొత్తం సీన్ రివర్స్ గేర్లో వెళ్తోందిగా.


ఏడాదిలో ఎన్నెన్నో :


ఈ ఏడాదిలో ఎన్నో విపత్తులు, దారుణాలు ఏపీలో జరిగాయి. జగన్ మాత్రం ఎక్కడికీ పోలేదు. పాదయాత్ర, మధ్యలో కోర్టుకు వెళ్ళడం అంతే. ఆయన ఉద్దేశ్యంలో  యాత్ర డీవియేట్ కాకూడదు అన్నది మంచిదే కానీ జనాలు కూడా అంతా చూస్తున్నారుగా. అసలు యాత్ర చేసేదే జనం కోసం కదా. వారు బాధల్లో ఉన్నపుడు వెళ్ళి ఓదార్చడం నాయకుడి లక్షణం. తీరుబాటు ఉన్నపుడు వస్తానంటే మర్యాద కాదుగా. ఈ చిన్న సూత్రం జగన్ ఎలా మరిచారో మరి.


ఆయుధాలు ఇచ్చేస్తున్నారు :


జగన్ తీరు చూస్తూంటే కోరి ఆయుధాలు అధికార పక్షానికి తానే ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసలే బాబు రాజకీయ గండర గండడు. ఆయన గాలి నుంచే పోగు చేస్తారు. మరి ఎదురుగా ఇలా ఆయుధాలు అప్పగిస్తే చూస్తూ ఊరుకుంటారా. చెడుగుడు ఆడేస్తారుగా. ఇపుడదే జరుగుతోంది. ఇలా జగన్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయనుకోవాలి. ఒకటి తన మీద, జనం మీద అతి నమ్మకం. రెండవది బాబు ను జనం నమ్మరని ధైర్యం. ఇందులో ఏది నిజం కాకపోయినా జగన్ ఇబ్బందుల్లో పడక తప్పదేమో..


మరింత సమాచారం తెలుసుకోండి: