ఆయన మేరు  నగధీధెరుదు, ధీరోదాత్తుడు, మెగాస్టార్. అరవైల్లోనూ ఇరవై స్పీడ్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసే స్టారాధిస్టారుడు. అందరికీ అన్నయ్యగా నీరాజనాలు అందుకుంటున్న చిరంజీవి. ఆయన ఇపుడు సైరా మూవీతో యమ బిజీగా ఉన్నారు. కానీ ఆయన రేపటి అడుగులేంటన్న దానిపైన మాత్రం ఇంటెరెస్టింగ్ చర్చ సాగిపోతోంది.


నెక్స్ట్ స్టెప్పేంటో:


చిరంజీవిది దశాబ్దకాలం రాజకీయ జీవితం. ఎమ్మెల్యేగా, రాజ్య సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఆయన చాలా చూసేసారు. తిరిగి కామ్ గా సినిమాలు చేసుకుంటున్నారు. రాజకీయం వద్దు బాబోయ్ అంటున్నా ఆయన చుట్టూ మాత్రం వైఫేలా అది వదలడం లేదు. చిరంజీవి రాజకీయాల్లోకి మళ్ళీ వస్తారా అని కొందరు, అసలు రావడమేంటి, ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు కదా మరి కొందరు ఇలా ఎవరికి తోంచిన కామెంట్స్ వారు చేసేస్తున్నారు.


ఉన్నట్లా లేనట్లా :


ఇంతకీ చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నట్లా లేనట్లా. ఉంటే మౌనమెలనోయీ అంటున్నారు. కాంగ్రెస్ మెంబర్ షిప్ చిరు రెన్యూవల్ చేసుకోలేదని లేటెస్ట్ గా టాక్. అంటే హస్తం బంధం తెగిపోయిందా అన్న డౌట్. లేదు చిరంజీవి మావాడే ఎన్నికల్లో ప్రచారం చేస్తారు, మా రాహుల్  మాట వింటారు అంటూ తెలంగాణా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎవరెన్ని అన్నా అసలు మనిషి చిరు మాత్రం మౌనమే భాషగా రాజకీయం చేసేస్తున్నారు.


తమ్ముడు వైపేనా :


తమ్ముడు పవన్ కళ్యాన్ జనసేనలో చిరంజీవి చేరుతారా అంటే నో అన్న మాట రావడం లేదు. చిరంజీవి అభిమానం సంఘాలు ఇపుడు పవన్ వైపు ఉన్నాయి. అలా కనుక చూసుకుంటే చిరు పరోక్షంగా పవన్ వెంట ఉన్నట్లే. మరి వచ్చే ఎన్నికల్లో చిరంజీవి జనసేన తరఫున ప్రచారం చేస్తారా అన్న డౌట్లు పుట్టుకువస్తున్నాయి. దీనికి కూడా బోలెడు ఆన్సర్లు ఉన్నాయి. కరెక్ట్ టైంలో చిరు వస్తారని, తమ్ముడికి అండగా నిలిచి ఏపీ పాలిటిక్స్ ని కుమ్మేస్తారని.


మొత్తానికి చిరంజీవి చుట్టూ ఇంత రాజకీయం తిరుగుతూంటే ఆయనకు రాజ‌కీయం తెలియకపోవడమేంటని  అంటున్నారు అంతే కాదు. రాజకీయాలు చిరు వదలలేదు అని కూడా చెబుతున్నారు. చూడాలి మరి మెగా స్టెప్పులు మళ్ళీ ఎలా పడతాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: