ఆధ్యత్మిక వేత్త, ప్రవచనకారునిగా పాపులరైన శ్ర పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి తొందరలో పొలిటికల్ గా యాక్టివ్ అవనున్నారా ? ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. దానికితోడు స్వామికి కూడా రాజకీయ వాసనలు ఎక్కువే. అందులోను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపుతో స్వామి ఇపుడు ఢిల్లీలోనే ఉన్నారు. దాంతో వారిభేటీపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. దసర శరన్నవరాత్రుల తర్వాత మాట్లాడుకుందాం రమ్మని అమిత్ షానే స్వామికి కబురుపంపారట. అందుకనే పరిపూర్ణానంద ఢిల్లీకెళ్ళారు.

 

పరిపూర్టానంద స్వామికి తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటీ ఉంది. కొన్ని లక్షల మంది భక్తులు ఆయన ప్రవచనాలను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు. శ్రీ పీఠం వదిలి ఆయన ఏ ఊరిలో పర్యటించినా అక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. దానికితోడు స్వామి తరచూ సామాజిక అంశాలతో పాటు రాజకీయ పరిణామాలపైన కూడా టివి చర్చా కార్యక్రమాల్లో పాల్గొనటం అందరూ చూసే ఉంటారు.  సరిగ్గా ఈ అంశంపైనే బిజెపి ఫోకస్ పెట్టింది. పరిపూర్ణానందకున్న ఇమేజిని ఉపయోగించుకోవాలని అమిత్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.

 

ఎటూ బిజెపికి సంస్ధాగతంగా  పెద్ద పట్టులేదు. ప్రతీ నియోజకవర్గంలో కొద్దొ గొప్పో సానుభూతిపరులైతే ఉన్నారు. అయితే నరేంద్రమోడి ప్రధాన మంత్రి అయిన తర్వాత తెలుగురాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమమని, నేతలకు శిక్షణా కార్యక్రమాలని, బూత్ కమిటి లీడర్ల సమావేశాల పేరుతో కాస్త హడావుడి జరుగుతోంది. దాంతో తమ పార్టీ చాలా బలొపేతమైపోయిందనే భ్రమల్లో  కమలనాధులున్నారు. మొత్తానికి తమ పార్టీకి పరిపూర్ణానంద ఇమేజి తోడయితే ముందస్తు ఎన్నికల్లో లబ్దిపొందవచ్చన్నది బిజెపి ఆలోచనగా కనబడుతోంది. అమిత్ షా భేటీలో చర్చలు ఫలప్రదమైతే స్వామిని ఏకంగా తెలంగాణా బిజెపి తరపున సిఎం అభ్యర్ధిగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: