తుపానులు అపాయాలకే కాదు, ఉపకారాలకూ పనికొస్తాయి. అప్పటికీ ఇప్పటికీ విపత్తులు వస్తే చాలా మంది జేబులు నిండడం చూస్తునే ఉన్నాం. వెనకటికి ఓ సినిమాలో గ్రామ పెద్ద అంటాడు, ఏంటో  ఊరంతా సుఖంగా ఉంది. అఖరుకు తుపానులు రావడంలేదు నాలుగు రాళ్ళు వెనకేసుకుందామంటే అని. అలా తుపానులకు  రాజకీయ నేతలకు మధ్యన  అవినాభావ సంబంధం ఏదో  వుంది.


దూసుకెళ్తున్న ఎంపీ :



ప్రముఖ నాయకుడు కింజరపు ఎర్రన్నాయుడు  కుమారుడుగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు గత నాలుగేళ్ళుగా జనంలో కలసిపోయి మంచి నాయకుడన్న పేరు సంపాదించుకున్నారు. ఇపుడు ఆయన ఆ పేరును రెండింతలు చేసుకుంటున్నాడు. తుపానుకు చిక్కుకున్న‌ జనాలను ఆదుకునేనేందుకు  రామ్మోహన్ నాయుడు పడుతున్న తపన ఇపుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. మోటార్ బైక్ మీద ఆయన కలియతిరుగూ గ్రామాలలోని ప్రజలను సేవలు చేయడమే కాదు. ఏకంగా సీఎం బాబుకు కూడా సమస్యలు ఇవీ అని చెప్పడం విశేషం.


అంతా తానై :


తుపాను టైంలో అన్ని వ్యవస్థలు స్థంభించిన వేళ ఈ యువ ఎంపీ అంతా తానే నడుస్తున్నాడు, నడిపిస్తున్నాడు, అందరినీ కలిపి ముందుకుపోతున్నాడు, ఎమ్మెల్యేలను  కూడా తన వెంట తిప్పుకుంటూ సహాయ చర్యలు వేగవంత అయ్యేలా చూస్తున్నాడు. మరో వైపు సిక్కోలు తుపాను గురించి సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియచేయడమే కాకుండా విరాళాలను సేకరించేలా చూస్తున్నాడు. 


మళ్ళీ ష్యూరా :


మరి ఇన్ని విధాలుగా ఎంపీ కష్టపడడం చూస్తూంటే ఆయనకు  ఎదురులేదనిపిస్తోందని అంటున్నారు. మరో మారు వచ్చే ఎన్నికలలో ఈ యువ ఎంపీ విజయబావుటా ఎగరేయడం ష్యూర్ గా కనిపిస్తోందంటున్నారు. ఇప్పటికే టీడీపీ గెలిచే ఎంపీ సీట్లలో ఫస్ట్ ప్లేస్ లో ఈ సీటు ఉందిట. తిత్లీ తుపాన్ రూపంలో ఎంపీ మరో మారు తన దక్షతను చాటుకునేందుకు అవకాశం తీసుకున్నారని, ఆ రకంగా ఆయనకు మేలే జరిగిందని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: