ఎన్టీఆర్ విలక్షణ నటుడు, అంతకు మించి సంచలన రాజకీయ నాయకుడు. వస్తూ వస్తూనే పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లో అధికారం అందుకున్న మొనగాడు. అంతేనా పాలన తనదైన శైలిలో చేసిన ప్రజా నాయకుడు. ఎక్కడా ఏదీ  మనసులో  దాచుకోకుండా కుండబద్దలు కొట్టి నిఖార్సైన పాలిటిక్స్ నడిపిన మహా నేత. ఆయన నిజ జీవితంలోనూ అదే ధైర్యం, తెగువ ఉంది. అందుకే ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ అయ్యారేమో.


ప్రత్యేక పుటలు :


అన్న నందమూరి ఏం చేసినా డేరింగ్  గానే చేశారు. ఏదీ దాచుకోలేదు. ఆఖరుకు తన రెండవ వివాహం కూడా. లక్ష్మీ పార్వతిని తాను పెళ్ళి చేసుకుంటునట్లు ఓ సినిమా ఫంక్షన్లో లక్షలాదిమంది అభిమానుల సమక్షంలో ప్రకటించిన ధీశాలి ఎన్టీఆర్. అటువంటి ఆయన జీవితంలో కొన్ని ప్రత్యేక పేజీలతో లక్ష్మీస్ ఎన్టీఆర్  తయారవుతోంది.


బయోపిక్ కి పోటీ :


ప్రస్తుతం అన్న గారి కుమారుడు బాలక్రిష్ణ నిర్మిస్తూ నటిస్తున్న  ఎన్టీఆర్ చిత్రంలో అసలైన జీవితం ఉండదని చాలమంది అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్ర టీం ఏకంగా చంద్రబాబు ని కలసి సూచనలు, సలహాలు తీసుకోవడంతో ఈ సినిమా అంతా సో సోగా రామారావు డూపు మూవీగానే సాగిపోతుందని టాక్ నడుస్తోంది. అటువంటి టైంలో పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ దూసుకువస్తోంది. దీనిని వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ తీస్తున్నడు. అంటేనే దీనికి మసాలా యాడ్ అయినట్లుగా భావించాలి.


రెండవ కోణం :


లక్ష్మీస్ ఎన్టీఆర్ పూర్తిగా అన్న గారి రెండవ కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఇందులో సందేహమే లేదు. తిరుపతి వచ్చిన చిత్ర యూనిట్ తో ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి ఉన్నారంటేనే ఈ సినిమా ఆమె యాంగిల్ నుంచి షూట్ చేయబఒతున్నారని అర్ధమైపోతోంది. పైగా ఆమె ఇపుడు వైసీపీలో ఉన్నారు. మరి, బాలయ్య మూవీతో రేపటి ఎన్నీకల్లో ప్రయోజనం పొందుదామని అనుకుంటున్న చంద్రబాబుకు  లక్ష్మీస్ ఎన్టీఆర్ దెబ్బ వేసేదే అన్నది వాస్తవం. అల్లుడు వెన్నుపోటు అన్నదే ఇక్కడ ప్రధాన అంశంగా ఉండబోతోంది. దాంతో చంద్రబాబుకే రాజకీయంగా నష్టమన్నది తెలిసిందే. ఇక ఇప్పటి జనరేషన్ కి తెలియని అనేక విషయాలు కూడా వర్మ జోడించి ఈ మూవీ తీసుకొస్తారని టాక్. అదే జరిగితే లక్ష్మీస్ ఎన్టీఆర్ అధికార టీడీపీకి డేంజర్ సిగ్నల్ మోగించినట్లే.


వర్మ సవాల్ :


ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితంలోని పలు క్లిప్పింగులను జోడిస్తూ ఓ వీడియో తయారు చేశాడు. ఈ వీడియోలో పలు విషయాలపై తానే స్వయంగా మాట్లాడుతూ ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. ముఖ్యంగా తాను రూపొందించబోయే సినిమా కేవలం లక్ష్మీపార్వతి పాయింట్ ఆఫ్ యూ లోనే ఉండదని, నిరూపించగలిగే నిజాల పాయింట్ ఆఫ్ యూలో మాత్రమే ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. ‘జనవరి 24న విడుదల కాబోతున్న ఈ సినిమా వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని చెప్పినా నమ్మరు కనుక చెప్పను’ అంటూ తన స్టైల్‌లో చెబుతూ వర్మ లేటెస్ట్ గా  వీడియో బయటకు వదిలాడు. మరి తొందరగా సినిమాని తీసేసే వర్మ ఈ మూవీని ఎన్నికల కంటే ముందే రెడీ చేస్తారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: