అన్నీ సర్వేల కంటే లగాటపాటి సర్వేలకు డిమాండ్ ఎక్కవని చెప్పాలి మరియు ఎక్కువ మంది కూడా నమ్ముతారు అందుకే ఆంధ్ర జ్యోతి ఛానల్ కూడా ఇది లగటపాటి సర్వే అని నొక్కి మరీ చెబుతుంటుంది. అయితే చంద్ర బాబు లగటపాటి చేత ఓ సీక్రెట్ సర్వే చేయించుకున్నట్టు సమాచారం. ఈసారి చంద్రబాబు ఓడిపోవడం ఖాయం. రహస్య సర్వేల్లో ఆరితేరిన చంద్రబాబుకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఇది. ఫలితంగా ఏపీలో కూడా కాంగ్రెస్ తో జతకట్టి ఎన్నికల బరిలో దిగుదామనుకున్న చంద్రబాబు ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ తో పొత్తు ఉండదంటూ మరోసారి టీడీపీ నుంచి లీకుల పర్వం మొదలైంది. 


ఫ్లాష్ న్యూస్: చంద్ర బాబు రహస్య సర్వే... దిమ్మ తిరిగిందా...!

అంతర్గత సర్వేలు చేయించుకోవడంలో చంద్రబాబు దిట్ట. తనకు కావాల్సిన విషయానికి సంబంధించి ముందుగా లీకులు వదుల్తారు. తర్వాత దానిపై రహస్యంగా సర్వే నిర్వహించారు. ఆ వచ్చిన ఫలితాలు పాజిటివ్ గా ఉంటే అధికారిక ప్రకటన ఉంటుంది. లేదంటే ఇక ఆ టాపిక్ ను అక్కడితో వదిలేస్తారు. కాంగ్రెస్ తో పొత్తుపై కూడా ఇలానే చేశారు చంద్రబాబు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి, కాంగ్రెస్ తో జతకట్టి బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపు ఇవ్వాలని భావించారు. తద్వారా తిరిగి తను అధికారంలోకి రావాలనే ఎత్తు వేశారు.

ఫ్లాష్ న్యూస్: చంద్ర బాబు రహస్య సర్వే...  దిమ్మ తిరిగిందా...!

కానీ ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీని అప్పట్లో ఎన్టీఆర్ స్థాపించారో, ఇప్పుడు అదే పార్టీతో బాబు సంసారానికి సిద్ధపడడాన్ని జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందనే కోపం ఏపీ ప్రజల్లో ఇంకా ఉంది. దీంతో కాంగ్రెస్ తో పొత్తు అంశం తనకు రివర్స్ అయ్యేలా ఉందని భావించిన బాబు వెంటనే ఆ ప్రతిపాదన నుంచి వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తన పార్టీకి చెందిన సభ్యులతో కాంగ్రెస్ తో పొత్తు ఉండదంటూ చిన్నచిన్న ప్రకటనలు చేయిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: