వైసీపీకి ఇపుడు వరస ఝలక్ లు తగులుతున్నాయి. ఎవరు ఎపుడు పార్టీలో ఉంటారో, ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంచార్జ్ లను మార్చుతూ జగన్ చేస్తున్న విన్యాసాలు నాయకులకు ఆగ్రహంగా మారుతున్నాయి. తమని వాడుకుని కరివేపాకుల్లా పారేస్తారా అంటూ వెంటనే పార్టీ ఫిరాయిస్తున్నారు. వారికి ఇపుడు అనేక రాజకీయ ప్రత్యామ్యాయాలు కూడా ఉన్నాయి.


ఆమె జనసేనలోకి :


వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మహిళా అధ్యక్షురాలు  పసుపులేటి ఉషాకిరణ్ వైసీపీని వీడారు. దసరా రోజున పవన్ సమక్షంలో జనసేన తీర్ధం తీసుకున్నారు. పదేళ్ళుగా వైసీపీని అట్టిపెట్టుకుని ఉన్న ఆ నాయకురాలు ఇపుడిలా పార్టీకి ఝలకు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దాంతో వైసీపీలో చర్చ మొదలైంది.


అందుకేనా అలా :


ఆమెను జగన్ చాలా కాలం క్రితం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ గా నియమించారు. దాంతో టికెట్ కన్ ఫార్మ్ అనుకుని ఆమె తనకు తోచిన తీరున పార్టీ కోసం పనిచేశారు. అయితే ఈ మధ్య ఆమెను తప్పించి కొత్తగా పార్టీలో చేరిన రియల్టర్ కే కే రాజుకు ఆ సీటు అప్పగించడం  పట్ల ఆమె గుస్సా అయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు  ఆమె దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇపుడు టైం చూసుకుని పార్టీకి గట్టి దెబ్బ కొట్టేశారు.


నష్టమేనా :


ఉత్తర నియోజకవర్గం వరకూ కొంత ఆమె లేని లోటు ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతే కాదు. వాయిస్ ఉన్న మహిళా నాయకురాలిగా ఆమె పార్టీని వీడడడం నష్టమేనని చెబుతున్నరు. ఇదిలా ఉంటే ఆమె వైసీపీని వదలడం వల్ల పార్టీపైన ఆ ప్రభావం  ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇక పార్టీలో అసంత్రుప్తులకు ఆమె ఓ దారి చూపించినట్లైందని  కూడా అంటున్నారు. ఇప్పటికే  చాలా సీట్లలో ఇంచార్జ్లను తప్పించేశారు. వారంతా కూడా ఇపుడు ఉషా కిరణ్ బాటలోనే పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిని కనిపెట్టి బుజ్జగించాల్సిన బాధ్యత మరి హై కమాండ్ చూసుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: