విశాఖ జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ తొందరలోనే కొత్త కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోతున్నారు. ఆయన ఒక్కరే కాదు, తన బ్యాచ్ మొత్తాన్ని కూడా తోడు తీసుకుని మరీ భారీ జంప్ చేయబోతున్నారు. తన ఫ్యూచర్ పాలిటిక్స్  కి పదును పెట్టిన ఈ నాయకుడు విశాఖ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు నాంది పలకనున్నారా అంటే అవుననే అనిపిస్తోంది.


ఆయన్నడిగితే :


జనసేనాని పవన్ మూడు నెలల క్రితం అనకాపల్లి టూర్ వేశారు. ఆ టైంలో ఆయన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇంట్లో విందు ఆరగించారు. ఆయనకు బర్త్ డే విషెస్ కూడా చెప్పారు. పార్టీలో చేరమని కూడా ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. పైగా మెగా కుటుంబంతో దాడి బంధం గొప్పదని చెప్పుకున్నారు. సీన్ కట్ చేతే తాను ఏ పార్టీలో చేరబోవడంలేదని దాడి ఆ తరువాత ప్రకటించేఅరు. ఇపుడు ఆయన రాజకీయ శత్రువు కొణతాల జనసేన లోకి వస్తున్నారు.


ప్రియ శిష్యులతో కలసి :


అనకాపల్లిలో కొణతాల రాంకిర్ష్ణతో పాటు, పెందుర్తికి చెందిన ఆయన శిష్యుడు గండి బాబ్జీ, మాడుగులకు చెందిన మరో శిష్యుడు పీవీజీ కుమార్ లతో కలుపులు జనసేనలో చేరుతున్నారు. ఈ ముగ్గురికీ పవన్ నుంచి టికెట్ల హామీ లభించిందని తెలుస్తోంది. కొణతాలకు అనకాపల్లి టికెట్ కన్ ఫార్మ్ కాగా, బాబ్జీకి పెందుర్తి, కుమర్ కి మాడుగుల ఇస్తారని అంటున్నారు.


పట్టు దొరికేనా :


విశాఖ జిల్లాలో ఇప్పటివరకు గట్టి  బలం లేని జనసేనకు ఇపుడు పట్టు దొరుకుతుందా అన్న చర్చ సాగుతోంది. జనసేనకు సరైన నాయకుడు జిల్లాలో లేని లోటును కొణతాల తీరుస్తారని అంటున్నారు. అలాగే ఆయనకు జిల్లా భాధ్యతలు కూడా అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే కొణతాలకు మునుపటి బలం, బలగం పెద్దగా లేవన్న మాట కూడా వినిపిస్తోంది. ఆయన వల్ల పార్టీకా, పార్టీ వల్ల ఆయనకా అన్నది కొద్ది రోజులు పోతే కానీ చెప్పలేమని అంటున్నారు. మొత్తానికి ఈ చేరికలతో  పవన్ జిల్లాలో కొంత బలం సాధించినట్లేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: