ఆ మద్య కర్ణాటకలో ఎన్నికలు సోషల్ మీడియాలో ఎన్నో సంచలనాలు సృష్టించాయి.  బీజేపీ, జేడీయూ మద్య పెద్ద యుద్దమే జరిగినంత పనైంది.  మొదట బిజెపి సీఎం అభ్యర్థిగా యడ్యూరప్ప పదవీబాధ్యతలు స్వీకరించినా మెజార్టీ నిరూపించుకోలేక జేడీయూ అభ్యర్థి కుమారస్వామి సీఎం బాధ్యతలు స్వీకరించారు.  కన్నడనాట చక్రం తిప్పిన ప్రధాని, కర్ణాటక మాజీ సీఎం దేవెగౌడ కుమారుడైన కుమార స్వామి పదవిలోకి రావడానికి ఆయన కీలక పాత్ర వహించారు.  ఇక మాజీ సీఎం సిద్ద రామయ్య తమ మద్దతు తెలిపారు. 
Image result for deve gowda sleeping
అయితే దేవెగౌడకు మరో మాజీ సీఎం సిద్ధరామయ్య మంచి శిష్యుడన్న సంగతి అందరికీ తెలిసిందే. తొలుత జేడీయూలోనే కీలక నేతగా ఎదిగిన సిద్ధరామయ్య, ఆపై పార్టీ తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, సుమారు పన్నెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి, సీఎంగానూ బాధ్యతలు నిర్వహించారు.   సాధారణంగా దేవేగౌడ ఏదైనా మీటింగ్ జరుగుతుంటే..కూర్చున్న సీట్లోనే ఆదమరిచి నిద్రపోతారని టాక్ ఉంది.  ఆయన శిశ్యుడు సిద్ద రామయ్య సైతం అదే పద్దతి..ఏమన్నా అంటే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటానని..అలాంటి సమయంలో కాస్త కునుకు పడుతుందని కొట్టి పడేస్తుంటారు. 
Image result for siddaramaiah sleeping
ఇప్పుడు గురు శిశ్యులు ఒకే వేధికపై కనిపించారు..మరి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. బెంగళూరులో ఓ కార్యక్రమం జరుగగా, ఇందులో దేవెగౌడ, కుమారస్వామి, సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఎప్పుడు సభా వేదికలపై ఉన్నా నిద్రపోతున్నట్టుగా కనిపించే దేవేగౌడ ఫోటోలు కొన్ని వందలు బయటకు వచ్చాయి. తాజాగా ఈయనకు  ఇప్పుడు సిద్దరామయ్య తోడయ్యారు.   

తాజాగా, ఈ కార్యక్రమంలోనూ వీరిద్దరూ కునుకు తీస్తున్నట్టు కనిపిస్తుండగా, పక్కనే ఉన్న కుమారస్వామి వారినే తదేకంగా చూస్తుండిపోయారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: