ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒకపక్క ప్రభుత్వ వ్యతిరేకత భయంకరంగా ఉండటంతో ఏపీ ప్రజల ఆశా చూపు ప్రతిపక్ష నేత జగన్ పై ఉంటుందని ఇప్పటికే అనేక సర్వేలలో వెల్లడైంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న చంద్రబాబు పై మొదటి నుండి ఆయన చేస్తున్న అవినీతిపై పోరాడుతున్న వైసీపీ అధినేత జగన్ రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితే కచ్చితంగా రాష్ట్రం బాగుపడుతుందని అభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు నమ్ముతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Image may contain: 5 people, outdoor

ఇదే క్రమంలో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన జనసేన కూడా ప్రస్తుతం టీడీపీ పై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం ఓటు బ్యాంక్ మొత్తం చీలిపోయిన క్రమంలో రాబోయే 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని అంటున్నారు చాలామంది నేతలు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో ప్రముఖ జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో వైసీపీ పార్టీ కి 2019 ఎలక్షన్ లో తిరుగు లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిపిన జాతీయ సర్వేలో ఫలితాలు చూస్తే వైసీపీకి 104 సీట్లు వస్తే టీడీపీకి 68 సీట్లు వస్తాయట.

Image may contain: 4 people, outdoor

ఇక బీజేపీకి అప్పట్లో నాలుగు సీట్లు వస్తే ఇపుడు ఒక్కటి వస్తుందట. మిగిలిన రెండు సీట్లలో జనసేన గెలుస్తుందంట. దీన్ని బట్టి చూస్తే బలమైన ప్రతిపక్షంగా టీడీపీ వస్తుందన్న మాట. అప్పటి బలాలు ఇపుడు రివర్స్ అవుతాయన్నమాట. ఈ సర్వే ప్రకారం ఉత్తర కోస్తాలో వైసీపీ, టీడీపీల మధ్య ఢీ అంటే ఢీ అనే సీన్ ఉంటుందట. క్రిష్ణా, గుంటూర్లో టీడీపీకి ఓట్ల షేర్ 60 శాతం వస్తే వైసీపీకి 40 శాతం వస్తాయి.

Image may contain: 8 people, outdoor

గోదావరి జిల్లాలో రెండు పార్టీలు సగం సగం ఓట్లు పంచుకుంటున్నాయి. ఉత్తరాంధ్రకు వచ్చేసరికి వైసీపీకి 55 శాతం, టీడీపీకి 45 శాతం ఓట్లు వస్తాయట. వైసీపీకి పునాదుల్లాటి ఆ జిల్లాల్లో మరో మారు ఆ పార్టీ జయభేరి మోగించడం ష్యూర్ అంటోంది సర్వే. ఇదే క్రమంలో 2014 ఎన్నికల్లో మాదిరిగానే రాయలసీమలో రానున్న ఎన్నికల్లో వైసీపీ మరోసారి తన సత్తా చాటుతుందని ఈ సర్వేలో తేలింది. ఏది ఏమైనా వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది అనటంలో ఎటువంటి సందేహం లేదు.




మరింత సమాచారం తెలుసుకోండి: