తైవాన్‌లో ఘోర రైలుప్రమాదం జరిగింది. తైవాన్‌లోని యిలియాన్ కౌంటీ పరిధిలో జరిగిన రైలు ప్రమాదంలో 22 మంది మరణించారు. 171 మంది గాయపడగా, వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం సాయంత్రం 4.50 గంటల సమయంలో పుయూమా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిందని తైవాన్ రైల్వే తెలిపింది.  366 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యూమా ఎక్స్ప్‌ప్రెస్‌ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని, మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు తప్పినట్టు అధికారులు వెల్లడించారు.

Taiwan, train derails, Puyuma Express train

పర్యాటకులను షులియన్ నుంచి టైటంగ్ వరకు ప్యూమా ఎక్స్ప్‌ప్రెస్‌ చేరవేస్తుంటుంది. రైలులోని ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. వాటిలో ఐదు బోగీలు జిన్మా స్టేషన్‌లోకి చొచ్చుకువచ్చాయి. బోగీలన్నీ ట్రాక్‌పై చిందరవందరగా పడిపోయాయి. ప్రమాదానికి ముందు రెండుసార్లు ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయడంతో రైలు ఊగిపోయిందని ప్రయాణికులు చెప్పారు. ప్రమాద సమయంలో కొందరు ప్రయాణికులు నిద్ర పోతున్నారని హాంకాంగ్ టీవీ చానెల్ తెలిపింది.  మూడు దశాబ్దాలలో (1981, 2003, 2011) జరిగిన అత్యంత ఘోర రైలు ప్రమాదమని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. అయితే, రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు.  


తైతుంగ్ నగరానికి వెళుతున్న ఈ రైలులో 366 మంది ప్రయాణికులు ఉన్నారని రైల్వేశాఖ పేర్కొన్నది. కాగా, ఈ రైలులో విదేశీ ప్రయాణికులెవరైనా ఉన్నారా? అని కూడా తనిఖీలు చేపట్టింది. సహాయ చర్యలు చేపట్టేందుకు 120 మంది సైనికులను ఘటనాస్థలానికి పంపినట్లు రక్షణ శాఖ తెలిపింది.ఇప్పటికే రక్షణ మంత్రిత్వశాఖ 120 మంది సైనికులను ఘటన స్థలానికి పంపించి సహాయక చర్యలను చేపట్టింది. రైలు శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.  తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌వెన్ స్పందిస్తూ ఇది భారీ విషాదమని ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: