Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 22, 2018 | Last Updated 1:57 am IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : చంద్రబాబు పెద్ద సాహసమే చేయబోతున్నారు

ఎడిటోరియల్ : చంద్రబాబు పెద్ద సాహసమే చేయబోతున్నారు
ఎడిటోరియల్ : చంద్రబాబు పెద్ద సాహసమే చేయబోతున్నారు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణా ముందస్తు ఎన్నికల సందర్భంగా  చంద్రబాబునాయుడు పెద్ద సాహసం చేయబోతున్నారా ? పార్టీ నేతలు అవుననే అంటున్నారు. ఇంతకీ ఆ సాహసం ఏమిటనుకుంటున్నారా ? ముందస్తు ఎన్నికల్లో తెలంగాణాలో తాను ప్రచారం చేస్తానని చంద్రబాబు తమ్ముళ్ళకు హామీ ఇచ్చారు. తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేయటమంటే చాలా పెద్ద సాహసం క్రిందే లెక్క. ఏపికి ముఖ్యమంత్రే అయినా, తెలుగుదేశంపార్టీకి జాతీయ అధ్యక్షుడైనా చంద్రబాబు తెలంగాణా వ్యవహారాలను పూర్తిగా గాలికొదిలేసిన విషయం తెలిసిందే.

 telangana-elections-chandrababu-campaigning-kcr-vo

తెలంగాణా రాజకీయాలపై గట్టిగా మాట్లాడలేని స్ధితిలో పడిపోయారు చంద్రబాబు. కారణం ఏమిటంటే  మూడున్నరేళ్ళ క్రితం బయటపడిన ఓటుకునోటు కేసే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ కేసులో తగులుకునే పదేళ్ళ ఉమ్మడి రాజధాని అయినప్పటికి హైదరాబాద్ ను అర్ధాంతరంగా వదిలేసుకుని విజయవాడకు పారిపోయారు. అప్పటి నుండి తెలంగాణా రాజకీయాలను ప్రత్యేకించి కెసియార్ గురించి లేదా తెలంగాణా ప్రభుత్వం గురించి నోరెత్తటానికే చంద్రబాబు భయపడిపోతున్నారు.

telangana-elections-chandrababu-campaigning-kcr-vo

ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకవైపు చంద్రబాబును కెసియార్ అమ్మనాబూతులు తిడుతున్నారు. ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ అని కెసియార్ పదే పదే బహిరంగసభల్లో అంటున్నా గట్టిగా బదులు కూడా ఇవ్వలేకపోతున్నారంటే చంద్రబాబు పరిస్ధితేంటో అర్ధమైపోతోంది. అటువంటిది తెలంగాణా ఎన్నికల్లో ప్రచారానికి చంద్రబాబు వస్తారంటేనే నమ్మకం కుదరటం లేదు.

telangana-elections-chandrababu-campaigning-kcr-vo

ఎందుకంటే,  ఎన్నికల ప్రచారానికి రావటమంటే కెసియార్ ను టార్గెట్ చేయాల్సిందే. మరి తనను టార్గెట్ చేస్తే కెసియార్ ఎందుకూరుకుంటారు? ఓటుకునోటు కేసు విచారణను వేగవంతం చేయరా ? అదే జరిగితే అపుడు చంద్రబాబు పరిస్దితేంటి ? నిజంగా తెలంగాణా టిడిపిలో ఉన్న నేతలే కొద్దిమంది. వారిలో కూడా గట్టి నేతలు ఎంతమందంటే టార్చిలైట్ వేసినా కనబడరు. మరి అటువంటి నేతలు ప్రచారం చేస్తే జనాలు ఎందుకు పట్టించుకుంటారు .

 telangana-elections-chandrababu-campaigning-kcr-vo

ఆ విషయాలు వారికి బాగా తెలుసు కాబట్టే చంద్రబాబును ప్రచారానికి రావలంటూ పదే పదే పట్టుపడుతున్నారు. వాళ్ళ ఒత్తిడికి లొంగి తాను తెలంగాణాలో ప్రచారానికి వస్తే జరగబోయేదేమిటో చంద్రబాబుకే బాగా తెలుసు. అందుకనే ఇంతకాలం తెలంగాణా వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఇక ఇపుడు ఎన్నికల సమయంలో కూడా దూరంగా ఉంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. అందుకనే ప్రచారానికి ఒప్పుకున్నట్లున్నారు. నిజంగానే చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వచ్చి కెసియార్ ను టార్గెట్ చేస్తే మాత్రం ముందస్తు ఎన్నికల వేడి, రాజకీయ మార్పులు ఏం రేంజిలో ఉంటయో ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే.

 

 

 


telangana-elections-chandrababu-campaigning-kcr-vo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ : టిడిపి మ్యానిఫెస్టో : ఉచితంగా ల్యాప్ టాప్ లట..నమ్మేదేనా ?
ఫ్లాష్ న్యూస్ : చంద్రబాబు ఆస్తులపై కేసు
ఎడిటోరియల్ : కెసియార్ ను వెంటాడుతున్న రేవంత్..పెద్ద బాంబే పేల్చారు
ఎడిటోరియల్ : జేసికి ఎంఎల్ఏల షాక్..రివర్స్ ఫిట్టింగ్
ఓ సీటులో టిఆర్ఎస్ చేతులెత్తేసిందా ? కాంగ్రెస్ లక్కీనే
ఎడిటోరియల్ : రాజేంద్రనగర్ కథ సుఖాంతం..అందరూ ఏకమైపోయారు
ఎడిటోరియల్ : జగన్, పవన్ అంటే చంద్రబాబు భయపడుతున్నారా ? కలిస్తే తప్పేంటి ?
మర్యాదగా ఉండదట..చంద్రబాబుకు కెసియార్ వార్నింగ్
టి ఎన్నికలపై కథలు చెప్పిన పవన్
బ్రేకింగ్ న్యూస్ : పంటలు తగలబడిన కేసు మూసేసిన ప్రభుత్వం
ఎడిటోరియల్ : మహాకూటమిలో గందరగోళం..కోదండకు కాంగ్రెస్ భారీ షాక్
ఎడిటోరియల్ : ప్రచారంలో సుహాసినికి ఇబ్బందులు తప్పవా ?
ఎడిటోరియల్ : ట్వీట్ తో చంద్రబాబుకు కల్యాణ్, జూనియర్ ఎన్టీయార్ షాక్
సుహాసినికి  జూనియర్, కల్యాణ్ షాక్
ఎడిటోరియల్ : చంద్రబాబు నిర్ణయం హైకోర్టుకు ప్రిస్టేజిగా మారిందా ?
ఎడిటోరియల్ : ఇద్దరు ఎంఎల్ఏలకు షాక్ ఇవ్వనున్న చంద్రబాబు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.