ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిత్లి తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడానికి రెడీ అవుతున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల లో వినపడుతున్న టాక్. ఇటీవల తెలంగాణ తెలుగుదేశం నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం.
Related image
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దయనీయమైన పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడానికి పార్టీతో చేతులు కలిపి ఎన్నికల లో పాల్గొంటున్న క్రమంలో చంద్రబాబుపై ఆంధ్రరాష్ట్రంలో అనేక విమర్శలు వస్తున్నా..టిడిపి పార్టీ పరువు నిలబెట్టడం కోసం సాహసోపేతంగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం జరిగింది.
Related image
ఈ క్రమంలో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పడంతో తెలుగు తుమ్ముళ్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్టు తెలిపారు.
Image result for chandrababu election campaign
చంద్రబాబు ప్రకటనపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడితే కచ్చితంగా రాజకీయ సమీకరణాలు మారిపోతాయని దేవాలయం చేస్తున్నారు టీ టీడీపీ నాయకులు. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల లో పాల్గొంటున్న చంద్రబాబుపై ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విపక్ష పార్టీ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: