లోకేష్ సన్నిహితునిగా ప్రచారంలో ఉన్న విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ ఇంటిపై అధికారులు దాడులు చేశారు. వ్యాపార సంబంధమైన వ్యవహారాలపై తేడాలున్నాయన్న అనుమానంతో జిఎస్టీ అధికారులు మేయర్ ఇంటిపై రాత్రిపూట దాడులు నిర్వహించటం గమనార్హం. దాడుల్లో హర్డు డిస్కులు, రికార్డులు, కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పడమట పోస్టల్ కీలనీలో ఉంటున్న శ్రధర్ ఇంటిపై జిఎస్టీ అధికారులు మంగళవారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో దాడులు చేశారు. రెండు గంటల పాటు సోదాలు నిర్వహించారు.


మొన్నటి పుష్కరాల సందర్భంగా విజయవాడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరిగాయి. అందులో భక్తులకు, సిబ్బందికి ఉచిత భోజనాలు కార్యక్రమం కూడా ఒకటి. అదే సమయంలో భక్తల సౌకర్యాలు కల్పించటం, ఉచిత రవాణా ఏర్పాటు చేయటం, బస కూడా చేసింది. వీటన్నింటికీ ప్రభుత్వం ప్రత్యేకంగా భారీ ఎత్తున నిధులను విడుదల చేసింది. ఆ నిధులంతా విజయవాడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ ఖర్చుల విషయంలోనే మేయర్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. అప్పటి నుండి జిఎస్టీ అధికారులు మేయర్ వ్యవహారాలపై ఓ కన్నేశారట.

 

దానికితోడు పుష్కరాల ఏర్పాట్లన్నీ కెఎంకె ఈవెంట్స్ సంస్ధ ఆధ్వర్యంలో జరిగాయి. ఆ సంస్ధలో మేయర్ భార్య డైరెక్టరట. అదే సమయంలో విజయవాడ కార్పొరేషన్ లో జరిగిన కోట్ల రూపాయల వ్యయంలో కూడా మేయర్ భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఏకంగా కార్పొరేటర్లే ఫిర్యాదులు చేశారట. ఎందుకంటే, మేయర్ కు కొందరు కార్పొరేటర్లకు ఎప్పటి నుండో పడటం లేదు. మేయర్ ను పదవిలో నుండి దింపటానికి చాలా ప్రయత్నాలే జరిగినా కేవలం లోకేష్ మద్దతు వల్లే శ్రీధర్ నెట్టుకొస్తున్నారట. మొత్తానికి టిడిపి నేతలపై వరుసపెట్టి ఐటి, ఈడి, జిఎస్టీ దాడులు జరుగుతుండటంతో నేతల్లో టెన్షన్ మొదలైంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: