ఏపీ రాజకీయాలలో సరికొత్త సామాజిక సమీకరణలు మొగ్గ తొడుగుతున్నాయి. నిన్నటి వరకు వేరుగా ఉన్న వర్గాలను ఒక్క చోట చేర్చేందుకు తెర వెనక ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఒకే రోజు రెండు పరిణామాలు ఆ దిశగా సాగడం విశేషం. అదే జరిగితే ఏపీ రాజకీయం మరో మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.


అకస్మాత్తుగా లక్నోకు :


ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ లక్నో పయనం కట్టారు. బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో భేటీకి పవన్ వెళ్ళారు. ఇది ఎవరూ ఊహించని మాస్టర్ పొలిటికల్ స్ట్రోక్ గానే భావించాలి. పవన్ గోదావరి జిల్లాల్లో తిరుగుతూ ఏదో అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ పోతున్నాడని ఇంతకాలం మిగతా పార్టీలు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ పవన్ లో ఒక్కసారి దూకుడు పెరిగింది. దాంతో  అందరూ అలెర్ట్ కావాల్సివస్తోంది.


చేరికలు..కూడికలు :


పవన్ ఇపుడు యమ బిజీగా ఉన్నారు. ఓ వైపు చేరికలు, మరో వైపు కూడికలు. ఇలా జోరు పెంచేశారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ లాంతి బిఘ్ షాట్ ని తన పక్కన పెట్టుకున్న పవన్ మరింతమంది పెద్ద తలకాయలను కూడా తిప్పుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అదలా ఉండగానే పొత్తుల ఎత్తులకు కూడా తెర తీశారు. ఏకంగా బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీకి రెడీ కావడం ద్వారా జాతీయ రాజకీయాన్ని ఆకట్టుకున్నారు.


ఇక్కడ ముద్రగడ:


అదే టైంలో ఇక్కడ ముద్రగడ కాకినాడలో దళితుల, కాపుల ఐక్యత పేరిట కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అది కూడా ఈ రోజే కావడం గమనార్హం. మరి పవన్ పార్టీకి, ఈ మీటింగుకు కూడా తెర వెనక ఏదైనా సంబంధం ఉందా అన్న డౌట్ కలుగగ మానదు. ముద్రగడ రెండు ప్రధాన సామాజిక వర్గాలను కలిపేందుకు నడుం బిగిస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన  పవన్ ఆదళితుల ఐకాన్ అనదగ్గ బీఎస్పీ అధినేత్రి మాయావతిని  కలవడం యాధ్రుచ్చికం కాబోదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


ఇద్దరికీ దెబ్బేనా :


కాపులు, దళితుల ఐక్యతా రాగం ఏపీలోని రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలకు దెబ్బేనని అంటున్నారు. పోయిన ఎన్నికల్లో కాపుల ఓట్లతోనే టీడీపీ అందలం ఎక్కితే, దళితుల ఓట్లతో వైసీపీ గణనీయంగా సీట్లను గెలుచుకుంది. మరి ఇపుడు ఈ కొత్త కాంబినేషన్ కనుక వర్కఔట్ అయితే ఆ పార్టీలకు షాక్ తప్పదని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: