వైసీపీకి ఉత్తరాంధ్రా జిల్లాల్లో ఖాయంగా గెలిచే సీటు అదేనంటున్నారు. పల్లె, పట్నం కలగలిపిన ఆ నియోజకవర్గం వైసీపీ  నినాదాలతో మోత మోగుతోంది. ఎన్నికలు ఎపుడు పెట్టినా అక్కడ గెలుపు గ్యారంటీ అంటున్నారంటే మద్దతు ఏ రేంజిలో ఉందో ఊహించవచ్చు. జగన్ అక్కడికి వెళ్తే  జనం పోటెత్తారు.


సాలూర్లో బ్రహ్మరధం :


విజయనగరం జిల్లా సాలూర్ వైసీపీకి బ్రహ్మరధం పడుతోంది. ఇప్పటికి పదేళ్ళుగా అక్కడ సైకిల్ ఎక్కని ఓటర్లు ఉన్నారు. మరో మారు వారు ఫ్యాన్ గుర్తుకే ఓటు అంటున్నారు. ఇపుడు సాలూరులో జగన్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. జనం జేజేల మధ్య జగన్ ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు.


మచ్చలేని రాజన్న:


ఇక్కడ ఎమ్మెల్యే  పీడిక రాజన్న దొరకు మరో పేరుంది. అదే ప్రజల మనిషి అని. ఆయన నిత్యం ప్రజల మధ్యనే ఉంటారు. ఆయన ఇల్లు చూస్తే ఎమ్మెల్యే దేనా లేక సామాన్యుడిదా అనిపించక మానదు. విలువలకు పట్టం కట్టే నేతగా ఆయనకు పేరుంది. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించినా పార్టీకి కట్టుబడిన నేతగా రాజన్న నిలిచారు. దాంతో అటు జగన్, ఇటు జనం మెచ్చిన నేతగా పేరు సంపాదించుకున్నారు.


ఆ దొరల కన్నా :


జగన్ సాలూరు మీటింగులో బొబ్బిలి దొరలతో రాజన్న దొరకు పోలిక తెచ్చారు. పార్టీ ఫిరాయించి టీడీపీకి అమ్ముడుపోయిన బొబ్బిలి  దొరల కంటే పార్టీ కోసం కట్టుబడిన మాట మీద నిలబడే విలువలు కలిగిన నేత రాజన్న దొర ఎంతో బెటర్ అని జగన్ అంటున్నపుడు జనం నుంచి విపరీతమైన స్పందన లభించింది. . మొత్తానికి జగన్ మీటింగుకు, పాదయాత్రకు వస్తున్న జనం చూసి టీడీపీ నేతలకు కలవరం పట్టుకుందంటున్నారు. ఇప్పటికి రెండు విడతలు గెలిచిన రాజన్న దొర హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: