పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల గురించి చాలా మాటలు మాట్లాడినాడు. తన వైఫల్యాలు ఎక్కడ బయటపడిపోతాయోనని.. చంద్రబాబు ఈ ఎన్నికలు జరగకుండా చూడడానికి ఏవైనా కొత్త ప్రణాళికలు రచిస్తే తప్ప... మూడునెలల్లోగా పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు నిర్వహించే అవసరం రాకుండా, పంచాయతీల్లో ప్రత్యేకాధికార్లను పెడుతూ చంద్రబాబు సర్కార్ జారీచేసిన జీవోను హైకోర్టు కొట్టవేసింది.


అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని కోరుకుంటున్న పార్టీల్లో మూడో కృష్ణుడుగా రంగప్రవేశం చేసిన పవన్ కల్యాణ్ అసలు బలమేంటో ఈ ఎన్నికల్లో తేలిపోతుంది. పంచాయతీ ఎన్నికలు అనేవి ఇప్పట్లో ఖచ్చితంగా రావు పంచాయతీ ఎన్నికలు అనేవి ఇప్పట్లో ఖచ్చితంగా రావు అని ఫిక్సయ్యారో ఏమో గానీ పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల గురించి చాలా చాలా దూకుడుగా మాట్లాడారు.


ఆ నడుమ గోదావరి జిల్లాల్లో పంచాయతీల మాజీ సర్పంచులతో ఆయన ఓ సమావేశం నిర్వహించారు. ఎన్నికలు వెంటనే నిర్వహించకుండా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారనే సంగతి ఆ సమావేశంలో ఆయన దృష్టికి వచ్చింది. ఆ వెంటనే పవన్ కల్యాణ్ రెచ్చిపోయారు.చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన సవాళ్లు విసిరారు. ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలు జరిగితే గనుక.. ఖచ్చితంగా జనసేన పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటుందని కూడా ఆయన ఢంకా బజాయించి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: