చంద్రబాబు పంచాయతీ ఎన్నికలు కు వెనకడుగు వేయడం  జగన్ ను చూసి భయపడటమే అని అందరూ భావిస్తున్నారు.  విశాఖ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నదని ప్రకటించారు. అయితే.. వాస్తవంలో పరిశీలిస్తే.. ఈ ఎన్నికలు నిర్వహించకుండా ఎగ్గొట్టడానికి ఎన్నెన్ని రకాల వక్రమార్గాలు ఉన్నాయో వాటన్నిటినీ అన్వేషించడానికి ప్రభుత్వం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.


పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి తమ ప్రభుత్వం ఎన్నడూ సిద్ధంగానే ఉన్నదని, కాకపోతే బీసీ రిజర్వేషన్ల వ్యవహారం తేలకపోవడం వల్లనే... జాప్యం జరుగుతున్నదని ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బీసీ గణన, వారికి పంచాయతీల కేటాయింపు వంటి ఆటంకాలు ఉన్నాయని చెబుతున్నారు.గతంలో 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకు కలిపి ఇచ్చిన రిజర్వేషన్లు 60 శాతానికి దాటిపోవడం వల్లనే అసలు గొడవ ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది.


అప్పట్లో దీనిపై కేసులు నమోదు కావడంతో.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా.. చర్యలు తీసుకోవాలని అప్పట్లో కోర్టు ఆదేశించింది.ఆ తీర్పను రాష్ట్రప్రభుత్వం అడ్డంగా వాడుకోవాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడం ఇంకా పూర్తి కానందువల్లనే.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేకపోతున్నాం అంటూ.. రాష్ట్రప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతుండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: