దేశంలో ఇపుడు ఎక్కడ చూసినా ప్రాంతీయ పార్టీల శకం నడుస్తోంది. అటువంటిది ఆ పార్టీలకు ఓటు వేయవద్దని చెప్పే దమ్మూ ధైర్యం ఎవరికైనా ఉంటుందా. అందులోనూ వాటితో బోలెడు అవసరాలు ఉంచుకున్న కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ ఈ పిలుపు ఇవ్వడం అంటే మరేమైనా ఉందా. కానీ పాత పధ్ధతిలోనే ఇంకా ఏపీ పెద్దాయన అలా నినాదాలు చేస్తున్నారు. 


కాంగ్రెస్ కే  ఓటు:


ఇంతవరకూ బాగుంది. దేశంలో జాతీయ పార్టీలుగా రెండే వున్నాయి కాబట్టి కాంగ్రెస్ కి మీ ఓటు వేయండని రఘువీరారెడ్డి అంటున్నారు. ఒక జాతీయ పార్టీ బీజేపీ ఏపీని మోసం చేసిందని, తాము అలా కాదని వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇచ్చి మరీ ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు. దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణలన్నీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు.


ఇప్పటికే డిసైడ్:


ఏపీ ప్రజలు ఇప్పటికే ఎవరికి ఓటు వేయాలన్నది డిసైడ్ చేసుకున్నారని కూడా రఘువీరా చెబుతున్నారు. ఎట్టి పరిస్థిల్లో ఎంపీ ఓటును మాత్రం కాంగ్రెస్ కి వారు వేస్తారని ఆయన ధీమాగా చెప్పారు. అదే టైంలో ఏపీలోనూ తమను అధికారంలోకి తీసుకువస్తే అంతా మంచే జరుగుతుందని అంటున్నారు. ఏపీలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష  వైసీపీ రెండూ కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో  ఘోరంగా విఫలం చెందాయని రఘువీరా ఘాట్ కామెంట్స్ చేశారు.


 ప్రాంతీయ పార్టీలకు ఓటెయొద్దు :


దేశంలో జాతీయ పార్టీలకే ఓటు వేయాలని, ప్రాంతీయ పార్టీలకు ఓటెయొద్దు  అంటూ కొత్త నినాదాన్ని రఘువీరా అందుకున్నారు. ఏపీలో రెండు  ప్రాంతీయ పార్టీలు నిర్మాణాత్మకమంగా వ్యవహరించకపోకపోగా వినాశక చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు. అధికార పక్షం తప్పులు చేయదం సహజం అనుకున్నా నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం తప్పులు చేయడమేంటని రఘువీరా ప్రశ్నించారు.


 ఏపీలో వైసీపీ పనితీరు అసలు బాగులేదని కూడా అయన సెటైర్లు వేశారు. వచ్చేది కాంగ్రెస్, ఏపీకి న్యాయం చేసేది కాంగ్రెస్ అని విశాఖ టూర్లో ఆయన క్లారిటీ ఇచ్చేశారు. కాగా ఇదే టూర్లో  ఆయన పక్కన ఉన్న కాంగ్రెస్ అపీ ఇంచార్జి  ఉమెన్ చాందీ మాత్రం  టీడీపీపై పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: