జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగానే కథలు వినిపిస్తున్నారు. నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబునాయుడుతో సావాసం చేసిన తర్వాత ఆ మాత్రం కథలు చెప్పే గుణం అబ్బకపోతే ఎలా చెప్పిండి ? ఇంతకీ పవన్ చెప్పే కథలేమిటనే కదా మీ సందేహం. జనసేనకున్న ఓట్ల శాతం గురించి ఈమధ్య మాట్లాడుతూ పవన్ ఓ మాట చెప్పారు. అదేమిటంటే జనసేనకు రాష్ట్రంలో 18 శాతం ఓట్లున్నాయట. అంత ఓటు శాతం జనసేనకు ఎక్కడనుండి వచ్చిందని ఎవరూ అడక్కూడదు. ఎందుకంటే చెప్పింది పవన్ కల్యాణ్ కాబట్టి నమ్మినా నమ్మకపోయినా చేయగలిగేదేంలేదు.

 

అసలే లెక్క ప్రకారం జనసేనకు 18 శాతం ఓట్లున్నాయని పవన్ నిర్ణయానికి వచ్చారో కూడా తెలీదు.  వినేవాళ్ళల్లో అడితే ధైర్యం ఎవరికీ ఉండదుకదా ? పవన్ మాట్లాడుతూ, వాళ్ళు, వీళ్ళు చెబుతున్నట్లుగా జనసేనకున్నది ఏ 4 శాతమో లేకపోతే 5 శాతం ఓట్లో కాదన్నారు. నిజంగానే జనసేనకు 5 శాతం ఓట్లేగనుక ఉంటే చంద్రబాబునాయుడు మనల్ని లెక్క చేస్తాడా ? అడగటం మరీ విచిత్రంగా ఉంది. జనసేనకు 18 శాతం ఓట్లున్నాయి కాబట్టే మనమంటే భయపడుతున్నారు అంటూ చెప్పేటప్పటికి అక్కడున్న వారికి నోట మాట రాలేదు.

 

జనసేనకు 4 లేదా 5 శాతం ఓట్లున్నాయనటానికి కూడా ఆధారమేదీ లేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓట్లేస్తారు అన్న విషయంపై మీడియా సంస్ధలు చేసిన సర్వేల్లో జనసేనకు అత్యధికంగా 6 శాతం ఓట్లు వస్తాయని తేలింది. జనసేనకున్న ఓట్లశాతంపై మీడియా జరిపిన సర్వేలే ఆధారం. రేపటి ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే కానీ నికరంగా ఎంత ఓట్ల శాతం వచ్చేది తేలదు. పవన్ ఇఫుడు చెప్పిన 18 శాతం ఓట్లు 2009లో ప్రజారాజ్యంపార్టీకి వచ్చిన ఓట్ల శాతం. బహుశా దాన్నే దృష్టిలో పెట్టుకున్నారేమో ? సరే రేపటి ఎన్నికల్లో ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వస్తాయన్న విషయాన్ని పక్కనపెడదాం. కోర్టు చెప్పినట్లుగా చంద్రబాబు పంచాయితీ ఎన్నికలు నిర్వహించి జనసేన ఎన్నికల్లో పాల్గొంటే అప్పుడు పవన్ పార్టీ బలంపై ఓ అంచనాకు రావచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: