జగన్ మీద దాడి గురించి  టీడీపీ నాయకుల మాటలు అందరి ఆగ్రహానికి గురౌతున్నాయి. జగన్ మీద జరిగిన హత్యాయత్నం గురించి రాష్ట్ర హోంమంత్రి అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఒకవైపు ఈ దాడిని ఖండిస్తున్నాం అంటూనే, ఇంటరాగేషన్ జరుగుతున్నదని అంటూనే.. ఇలాంటి ఘటనలు జరగడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుందని.. జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉన్నదని.. హోంమంత్రి చినరాజప్ప విలేకర్ల సమావేశంలో వ్యాఖ్యానించడం జగన్ అభిమానులకు ఆగ్రహం కలిగిస్తోంది.


పదినిమిషాల పాటు విలేకర్ల సమావేశం నిర్వహించిన హోంమంత్రి చినరాజప్ప.. కనీసం ఒక్కమాట కూడా.. భద్రతా వైఫల్యం ఉన్నట్లుగా అంగీకరించకపోవడం గమనార్హం. జగన్మోహన్ రెడ్డి మీద విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో.. ఏపీ హోంమంత్రి చినరాజప్ప విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి జరిగిన దాడిని ఖండించారు. ఇలాంటి దాడులు ఎవరి మీద జరిగినా ఖండించాల్సిందేనని ఆయన అన్నారు.


దాడిచేసిన శ్రీనివాస్ ను తమ పోలీసులు అరెస్టు చేశారని, ఇంటరాగేషన్ జరుగుతున్నదని.. ఆయన ఏ పార్టీకి చెందినవాడో, ఎవరు ఆయన వెనుక ఉండి.. ఈ దాడి చేయించారో అన్ని వివరాలు ఒక గంటలోగా చెప్తాం అంటూ చినరాజప్ప వ్యాఖ్యానించారు.దాడిచేసిన శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలిసిందని చినరాజప్ప చెప్పారు. ఈ సందర్భంగానే చినరాజప్ప దాడిగురించి నిర్లక్ష్యంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తన పాదయాత్రలో తనతో ఎవరు సెల్ఫీ దిగాలని వచ్చినా కూడా.. ఆయనే ముందుకెళ్లిపోతుంటారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: