జగన్ మీద టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు ప్రజా వ్యతిరేకత కు కారణ మవుతున్నాయి. అయితే చంద్ర బాబు చేసిన వ్యాఖ్యలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తన మీద ఒక దుండగుడు కత్తితో దాడికి పాల్పడితే.. అదృష్టవశాత్తూ ఆ సమయానికి పక్కకు మరలడం వల్ల.. భుజం మీద గాయంతో బయటపడితే.. ఎవరైనా ఎలా స్పందించాలి? తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం చాలా హేయంగా స్పందించారు. ఈ దాడి వ్యవహారాన్ని పక్కకు మళ్లించడానికి దాడి జరిగిన పదినిమిషాల్లోనే పచ్చ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇలాంటి అన్ని కుయత్నాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పండించినదే కామెడీ ఆఫ్ ది డేగా చెప్పుకోవాలి.


దాడి జరిగిన కాసేపటికే మీడియా ముందుకు వచ్చిన హోంమంత్రి చినరాజప్ప దగ్గరినుంచి ప్రతి ఒక్కరూ.. జగన్ దే తప్పని చెప్పడానికి తెగ ప్రయత్నం చేశారు. జగన్ బాధ్యతగా ఉండాలని.. ఆయననే తప్పుపట్టే ప్రయత్నం చేశారు. అసలు జగనే, తన అభిమానితో అపాయం లేని విధంగా పొడిపించుకుని.. సానుభూతి కోసం డ్రామా ఆడుతున్నాడని అర్థంవచ్చేలా కూడా చాలామంది మాట్లాడారు. వీరందరిదీ ఒకఎత్తు.. చంద్రబాబు ది మరోఎత్తు.


చంద్రబాబునాయుడు  మీడియాతో మాట్లాడుతూ.. ‘దాడికి గురైన వ్యక్తి విమానం ఎక్కి హైదరాబాదుకు వెళ్లిపోయాడంటూ’ తప్పుపట్టారు. దాడి గురించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది కదా.. పోలీసుల విచారణకు సహకరించకుండా ఆయన హైదరాబాదుకు వెళ్లిపోతే ఎలా? దాడికి గురైన వ్యక్తితో.. దాడి ఎలా జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు పొరుగు రాష్ట్రానికి వెళ్లి విచారించాలా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఆ రకంగా.. జగన్మోహన్ రెడ్డి ఎంత బాధ్యతా రహితంగా చేశారో సెలవిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: