జగన్ మీద టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు ప్రజా వ్యతిరేకత కు కారణ మవుతున్నాయి. అయితే చంద్ర బాబు చేసిన వ్యాఖ్యలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో హుందాగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి తన లేకి బుద్ధిని మరోసారి బైటపెట్టుకున్నారు. బాబులో అసహనం ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి నిన్న సాయంత్రం నుంచి ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ఆయన మాటలే నిదర్శనాలు.


ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పెడుతున్న కామెంట్స్ అతడిపై సామాన్య జనంలో ఉన్న కాస్తో కూస్తో గౌరవాన్ని కూడా తగ్గించేస్తున్నాయి. ఒక ప్రతిపక్ష నేతపై హై-సెక్యూరిటీ ఉండే ఎయిర్ పోర్ట్ లో దాడి జరగడం సామాన్య విషయమా? దాన్ని ఇతర పార్టీల నేతలు, పొరుగు రాష్ట్రాల వాళ్లు ఖండించడం తప్పా? చంద్రబాబు దృష్టిలో ఇది చాలా పెద్దతప్పు. బాబు వాలకం చూస్తుంటే ఆయనకు పూర్తిగా మతి భ్రమించినట్టు అర్థమైపోతోంది.


సంఘటన జరిగిన వెంటనే గవర్నర్ డీజీపీని రిపోర్ట్ అడగటం, పవన్ కల్యాణ్ స్పందించడం, పలువురు కేంద్ర మంత్రులు రియాక్ట్ అవ్వడం, కేసీఆర్-కేటీఆర్ కూడా దాడి ఘటనను ఖండించడాన్ని బాబు తట్టుకోలేక పోతూ న్నాడు.  తిత్లీపై స్పందించని కేసీఆర్, కేటీఆర్ జగన్ పై దాడి జరిగితే ఎందుకు స్పందించారని ప్రశ్నిస్తున్నారు. దీనివెనక కూడా కుట్ర కోణాన్ని వెదకడం చంద్రబాబుకే చెల్లింది. పైగా సానుభూతిపరుడే దాడి చేశాడని చెప్పి, వైసీపీపై బురద చల్లే ప్రయత్నం చేయడం బాబు దిగజారుడుతనానికి పరాకాష్ట.



మరింత సమాచారం తెలుసుకోండి: